AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger 3: సల్మాన్ ఖాన్ టైగర్ 3‌లో ఎన్టీఆర్..? అభిమానులకు పూనకాలే

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి చేర్చింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాల పై బాలీవుడ్ లో ఆసక్తి పెరిగింది.

Tiger 3: సల్మాన్ ఖాన్ టైగర్ 3‌లో ఎన్టీఆర్..? అభిమానులకు పూనకాలే
Tiger 3 Movie
Rajeev Rayala
|

Updated on: Nov 13, 2023 | 10:31 AM

Share

ఈ మధ్య కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ అంటూ బ్యారికేట్స్ చెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీస్ గా సినిమాలు రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో సక్సెస్ అవుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి చేర్చింది. దాంతో ఇప్పుడు తెలుగు సినిమాల పై బాలీవుడ్ లో ఆసక్తి పెరిగింది. ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో సినిమా చేస్తున్నారు.హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 3లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చారు హృతిక్. వార్  సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వార్ సినిమాలో హృతిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా నటించారు.

ఇప్పుడు వార్ 2లో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ గురించి బాలీవుడ్ లో ఓ ఇంట్రస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. అలాగే హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో క్యామియో లో కనిపించాడు.

అయితే టైగర్ 3 లో ఎన్టీఆర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. టైగర్ 3లో ఎన్టీఆర్ రోల్ లేదు కానీ ఆయన గురించిన ప్రస్తావన మాత్రం ఉందని తెలుస్తోంది. టైగర్ 3 సినిమాలో హృతిక్  ఓ భయంకరమైన విలన్ గురించి చెప్తాడు. మనం ఇప్పుడు ఒక కొత్త శత్రువుని ఎదుర్కోబోతున్నాము. అతడికి పేరు, మొఖం అనేవి లేవు. భయానికే భయం కలిగించే ఆ వ్యక్తి మరణం కన్నా డేంజర్. ఆ సైతాన్ తో నువ్వు పోరాడితే నువ్వు కూడా సైతాన్‌ వి అయ్యిపోతావేమో” అంటూ హృతిక్ చెప్తాడు. దాంతో హృతిక్ చెప్పిన విలన్ ఎన్టీఆర్ అని అంటున్నారు. మరి హృతిక్ చెప్పింది రామ్ గురించేనా.. అన్నది తెలియాల్సి ఉంది.

హృతిక్ రోషన్ ట్విట్టర్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.