
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా తమ్ముడు రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మాస్ యాక్షన్ డ్రామా జులై 04న థియేటర్లలోకి అడుగు పెట్టనుంది. సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ తమ్ముడు పై అంచనాలు పెంచేశాయి. హీరో నితిన్ కూడా ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ ను పవర్ ఫుల్ గా చూపించిన వేణు శ్రీరామ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. స్వాసిక విజయ్ , వర్షా బొల్లమ్మ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. వీరితో పాటు సీనియర్ హీరోయిన్ లయ సుమారు 18 ఏళ్ల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనుంది. లయ ఈ సినిమాలో నితిన్‌కి అక్క పాత్రలో కనిపించనుంది. ఇక లయకు కూతురిగా, నితిన్ కి మేనకోడలుగా ఈ సినిమాలో ఒక పాప నటిస్తుంది. సినిమా కథంతా ఈ పాప చుట్టూనే తిరుగుతుందని సమాచారం. అందుకే
తమ్ముడి సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక్క అప్ డేట్ లో నితిన్ పక్కన ఈ పాప కనిపించింది.
ముఖ్యంగా తమ్ముడు సినిమా పోస్టర్లలో, ట్రైలర్ లో కూడా నితిన్ ఆ పాపని ఎత్తుకొని బాగా హైలైట్ అయ్యింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొని తన క్యూట్ మాటలతో, ఎక్స్ప్రెషన్స్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది. దీంతో అసలు ఆ పాప ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి? అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఈ పాప పేరు దీత్య. తను మరెవరో కాదు తమ్ముడు సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కూతురేనని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ పాప తన తండ్రిలాగే తనకు కూడా పవన్ కల్యాణ్ తన ఫేవరేట్ హీరో అని చెప్పింది. మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పాప నే ట్రెండింగ్. తమ్ముడు సినిమా తర్వాత కూడా దీత్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది.
కాగా ఇదే తమ్ముడు సినిమాలోనే మరో ఇంపార్టెంట్ రోల్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ అక్షర దేవళ్ల కూడా కనిపించనుంది. ఇప్పటికే ట్రయలర్స్‌లో ఆ అమ్మాయి కనిపిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో akshara_jabili ఐడీతో పాపులర్ అయిన అక్షర దేవళ్ల రోల్ ఈ సినిమాలో ఏంటన్నది ఆసక్తిగా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.