Preethi Pagadala: మా నాన్నగారు ముద్దులు పెట్టొద్దన్నారండీ..!! కానీ అది మాత్రం ఓకే
ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ తమ టాలెంట్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంటున్నారు కొందరు బ్యూటీలు. ఈ ముద్దుగుమ్మతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడంతో పాటు రకరకాల ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. కొందరు టీవీ షోల్లో పాల్గొంటుంటే.. మరికొంతమంది ఏకంగా హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు.. ఈ మధ్య మన తెలుగు అమ్మాయిలకు కూడా ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది కొత్త భామలు పరిచయం అవుతున్నారు. సోషల్ మీడియాలో.. ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేస్తూ తమ టాలెంట్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంటున్నారు కొందరు బ్యూటీలు. ఈ ముద్దుగుమ్మతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడంతో పాటు రకరకాల ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. కొందరు టీవీ షోల్లో పాల్గొంటుంటే.. మరికొంతమంది ఏకంగా హీరోయిన్ అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ అందాల భామ హీరోయిన్ గా అడుగు పెడుతోంది. ఆమె పేరే.. ప్రీతి పగడాల.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో చిత్ర విచిత్రమైన రీల్స్ చేస్తుంది. కోడిగుడ్డు మోటివేషన్ అంటూ కొన్ని వీడియోలు.. రకరకాల డ్రస్స్ లు వేసుకుంటూ వీడియోలు చేస్తుంది. అమెరికన్ యాసెంట్లో తెలుగు మాట్లాడుతూ అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు హీరోయిన్ గా మారిపోయింది. పతంగ్ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుందగి ప్రీతీ.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. అవకాశం వస్తే ఇంటిమేట్ సీన్లో నటిస్తారా.? అని అడిగిన ప్రశ్నకు .. మా నాన్న గారు ఓ కండీషన్ పెట్టారు. సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పినప్పుడు ఆయన లిప్ లాక్ సీన్స్ మాత్రం చెయ్యొద్దు అని అన్నారు. ఆయన నాకోసం ఎన్నో చేశారు. నేను అడిగిన ప్రతిఒక్కటి చేశారు. ఆయన అడిగిన ఈ ఒక్కటి ఎందుకు చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నా.. కాబట్టి లిప్ లాక్ సీన్స్ కు నో చెప్తాను. గ్లామర్ షో కి మాత్రం ఎలాంటి కండీషన్ లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో షార్ట్స్ డ్రస్సుల వాడకం కామన్ అయ్యింది అని తెలిపింది ప్రీతీ.
ప్రీతీ పగడాల ఇన్ స్టా..
View this post on Instagram
ప్రీతీ పగడాల ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.