K.G.F Chapter 2: కేజీఎఫ్ 2 నుంచి మరో పవర్ ఫుల్ పాత్ర.. ఇనాయత్ ఖలీల్ గా నటించింది ఎవరో తెలుసా..
ప్రజెంట్ నేషనల్ లెవల్ ఫిలిం లవర్స్ కూడా సౌత్ ఇండియన్ సినిమా కేజీఎఫ్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావటంతో సీక్వెల్ మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.

K.G.F Chapter 2:
ప్రజెంట్ నేషనల్ లెవల్ ఫిలిం లవర్స్ కూడా సౌత్ ఇండియన్ సినిమా కేజీఎఫ్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావటంతో సీక్వెల్ మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ రేంజ్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక కేజీఎఫ్ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవడానికి ప్రధాన కారణాల్లో ఇందులోని యాక్షన్ సన్నివేశాలు ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు వస్తోన్న సీక్వెల్ చిత్రంలో అంతకు మించిన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్ , రవీనా టాండన్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా లెంగ్త్ మూడు గంటలకు పైనే ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ స్టార్ కాస్ట్ ఉండటం కంటెంట్ పరంగానూ ఎక్కువ స్కోప్ ఉండటంతో సినిమాను కాస్త లెంగ్తీగానే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని మరో కీలక పాత్రను రివీల్ చేసారు చిత్రయూనిట్.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్ లతో పాటు అదిరిపోయే టీజర్ తో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అలాగే కేజీఎఫ్ సీక్వెల్ టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సెట్ చేసింది. తాజాగా పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇనాయత్ ఖలీకి సంబంధించిన కేజీఎఫ్ టైమ్స్ పత్రికలో ఆ క్యారెక్టర్ పోషించిన బాలకృష్ణగారి పిక్ రిలీజ్ చేశారు. బాలకృష్ణ ఎవరో కాదు టాలీవుడ్ యాక్టర్ ఆదర్ష్ బాలకృష్ణ తండ్రి. ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ అనేది చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్.. అంతేగాక ఇనాయత్ ఖలీల్ ప్రస్తుతం ఇండియాలో ఏదొక చోట పుట్టినరోజు జరుగుకుంటున్నట్లు కాప్షన్ జోడించారు.
Wishing @BalaTheKrishna a very Happy Birthday. Have a safe birthday chinna? Here’s a glimpse of #InayathKhalil in #KGFChapter2 Stay home stay safe everyone?? pic.twitter.com/SNl8RlVq0l
— Prashanth Neel (@prashanth_neel) May 31, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
