Bigg Boss 6: బిగ్ బాస్ చివరి కెప్టెన్‌గా ఇనాయ.. డైరెక్ట్‌గా సెమీ ఫైనల్ వీక్‌లోకి

|

Nov 26, 2022 | 8:56 AM

ఇక నిన్నటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో చివరి కెప్టెన్ అయ్యే ప్రక్రియ మొదలైంది.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్‌లో ఇనయ, రోహిత్ తప్ప అందరూ కెప్టెన్ అయిన వాళ్లే.

Bigg Boss 6: బిగ్ బాస్ చివరి కెప్టెన్‌గా ఇనాయ.. డైరెక్ట్‌గా సెమీ ఫైనల్ వీక్‌లోకి
Inaya Sultana
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6 మరికొద్ది వారాల్లో ముగుస్తుంది. ఇప్పటికే టాప్ 5లో ఎవరు ఉంటారు.? విన్నర్ ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక నిన్నటి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ లో చివరి కెప్టెన్ అయ్యే ప్రక్రియ మొదలైంది.  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్‌లో ఇనయ, రోహిత్ తప్ప అందరూ కెప్టెన్ అయిన వాళ్లే. గ్రాబ్ అండ్ రన్ టాస్క్‌లో బాల్ పట్టుకుని పరుగుపెట్టాలి. ఇందులో ఇంటి సభ్యులంతా హోరా హీరోగా పోటీపడ్డారు. రోహిత్‌ని నమ్మించి మోసం చేసి ఇనాయ కెప్టెన్. ఈ టాస్క్‌లో అబ్బాయిలో అమ్మాయిలు పోటీపడిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివరి రౌండ్‌‌లో ఆదిరెడ్డితో శ్రీసత్య, ఇనయ, కీర్తిలు చాలా పోరాడారు. చివరికి ఆదిరెడ్డిని ఆట నుంచి అవుట్ చేశారు. ఆ తరువాత ఇనయ పోరాడిన తీరు ఆకట్టుకుంది. ఇనాయ ఆటకు కీర్తి, శ్రీసత్యలు తేలిపోయారు

ఫలితంగా ఇనాయ చివరి కెప్టెన్ గా నిలిచింది. రోహిత్ అయితే అందరికంటే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చినా.. అతనికి ఎప్పటిలాగే లక్ కలిసిరాలేదు. అయితే ఈవారం కెప్టెన్ అయిన వాళ్లు నేరుగా సెమీ ఫైనల్ వీక్‌లోకి అడుగుపెట్టబోతుండటంతో.. ఇనయ సెమీ ఫైనల్‌కి వెళ్లిపోయింది.

ఈ గేమ్ లో రోహిత్-ఇనయ పథకం వేశారు. అన్నా నీకు బాల్ వస్తే నన్ను డిస్ క్వాలిఫై చేయొద్దని చెప్పింది ఇనాయ. ఆ డీల్‌లో భాగంగానే రోహిత్ దగ్గరకు బాల్ వచ్చినప్పుడు.. రేవంత్‌ని డిస్ క్వాలిఫై చేశాడు. కానీ ఇనయ దగ్గరకు బాల్ వచ్చేసరికి రోహిత్‌ని డిస్ క్వాలిఫై చేసింది. దాంతో రోహిత్ షాక్ అయ్యాడు. మొత్తంగా ఇనాయ విన్ అయ్యి కెప్టెన్ అయ్యింది.

ఇవి కూడా చదవండి