Tiger Nageshwar Rao: టైగర్ నాగేశ్వర్ రావు నుంచి ‘ఇచ్చేసుకుంటాలే’ సాంగ్ రిలీజ్..

రవితేజ కెరీర్ లోనే తొలిసారిగా  పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు వంశీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 1970 కాలంలో స్టూవర్టుపురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవితకథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తోంది.

Tiger Nageshwar Rao: టైగర్ నాగేశ్వర్ రావు నుంచి ఇచ్చేసుకుంటాలే సాంగ్ రిలీజ్..
Tiger Nageshwar Rao

Updated on: Oct 12, 2023 | 9:30 PM

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తోన్న మాస్ మహారాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు. ఆయన కెరీర్ లోనే తొలిసారిగా  పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు వంశీ. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 1970 కాలంలో స్టూవర్టుపురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవితకథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ఇచ్చేసుకుంటాలే పాటను విడుదల చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ఇచ్చేసుకుంటాలే సాంగ్ ఆకట్టుకుంటుంది. రవితేజ, గాయత్రి భరద్వాజ్ మధ్య వచ్చే ఈ డ్యూయేట్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను నచ్చేస్తుంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్ అందించిన సంగీతం మెస్మరైజ్ చేస్తుంది. ఇక పాటలో చూపించిన విజువల్స్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు భాస్కర బట్ల సాహిత్యం అందించగా.. సింధూరి విశాల్ ఆలపించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాను ప్రపంచవ్యా్ప్తంగా దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమాలో చూపించే పాత్రలు అన్ని నిజమే అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్. ఇక ఈ మూవీలో సీనియర్ నటి రేణూ దేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఈ మూవీతోనే ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.