AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: అమితాబ్‏కు చిరంజీవి స్పెషల్ సర్‏ప్రైజ్.. మెగాస్టార్ మాటలు విని బిగ్ బి ఎమోషనల్..

ప్రస్తుతం ఆయన హోస్టింగ్ చేస్తోన్న రియాల్టీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' వేదికపై అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలా జరుపుకున్నారు. ఆ క్షణం గుర్తుండిపోయేలా బిగ్ బి పుట్టినరోజును జరుపుకోవడానికి మేకర్స్ తమ వంతు ప్రయత్నం చేశారు.KBC 15 తాజా ఎపిసోడ్ ప్రారంభంలో, ప్రతి ఒక్కరూ అమితాబ్ బచ్చన్ 81వ పుట్టినరోజు సెలబ్రెట్ చేస్తూ ఆయనకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బీ కు వీడియోల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు సినీ పరిశ్రమలోని నటీనటుల వీడియోలు స్క్రీన్ పై ప్రదర్శించబడ్డాయి.

Megastar Chiranjeevi: అమితాబ్‏కు చిరంజీవి స్పెషల్ సర్‏ప్రైజ్.. మెగాస్టార్ మాటలు విని బిగ్ బి ఎమోషనల్..
Chiranjeevi, Amitabh
Rajitha Chanti
|

Updated on: Oct 12, 2023 | 10:05 PM

Share

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు అభిమానులు. 81 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ సహయ పాత్రలు పోషిస్తూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అమితాబ్. ప్రస్తుతం ఆయన హోస్టింగ్ చేస్తోన్న రియాల్టీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ వేదికపై అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలా జరుపుకున్నారు. ఆ క్షణం గుర్తుండిపోయేలా బిగ్ బి పుట్టినరోజును జరుపుకోవడానికి మేకర్స్ తమ వంతు ప్రయత్నం చేశారు.KBC 15 తాజా ఎపిసోడ్ ప్రారంభంలో, ప్రతి ఒక్కరూ అమితాబ్ బచ్చన్ 81వ పుట్టినరోజు సెలబ్రెట్ చేస్తూ ఆయనకు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా బిగ్ బీ కు వీడియోల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు సినీ పరిశ్రమలోని నటీనటుల వీడియోలు స్క్రీన్ పై ప్రదర్శించబడ్డాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం బిగ్ బీ పై ఉన్న తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆ వీడియోలో చిరంజీవి మాట్లాడుతూ..”నాకు 1975 సంవత్సరం అని గుర్తు.. నా పుట్టినరోజు ఆగస్టు 22. ఆ రోజున మా నాన్న నాకు అత్యంత విలువైన బహుమతి ఇచ్చారు. నిజానికి అప్పుడు నాకు అది ఎంతో ప్రత్యేకం. అమిత్ జీ సినిమా షోలే కోసం నాన్న నాకు టిక్కెట్ ఇచ్చారు. మీరు ఎల్లప్పుడూ నాకు మార్గదర్శకంగా ఉన్నారు. ఇక ఇటీవల మీరు నా సినిమాలో నాకు గురువుగా నటించారు.. కానీ నిజం ఏమిటంటే తెరపైనే కాదు నిజ జీవితంలో కూడా మీరే నాకు గురువు. అమిత్ జీ 81వ పుట్టినరోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందంతో కూడిన దీర్ఘాయువు కలగాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.” అంటూ చిరు చెప్పుకొచ్చారు. మెగాస్టార్ నుంచి వచ్చిన ఈ మెసేజ్ చూసి బిగ్ బి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతున్నాయి.

అంతకుముందు ట్వి్ట్టర్ వేదికగా అమితాబ్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు చిరు. “గురూజీ.. మీకు 81వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంతోషం, మంచి ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయువతో ఆశీర్వదించబడాలి. మీ నటనతో అనేక సంవత్సరాలపాటు లక్షలాది మందికి స్పూర్తినిస్తూ ఉండాలి. మీరు నా ఆరాధ్యదైవం” అంటూ ట్వీట్ చేశారు చిరు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.