Animal : “యానిమల్‌లో కొన్నిసన్నివేశాలు నాకు నచ్చలేదు”.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబీ డియోల్ సోదరుడు

రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రణబీర్, బాబీడియోల్ తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమాపై సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ 'యానిమల్' చిత్రంగురించి స్పందించాడు.

Animal : యానిమల్‌లో కొన్నిసన్నివేశాలు నాకు నచ్చలేదు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబీ డియోల్ సోదరుడు
Animal
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 15, 2023 | 1:00 PM

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్’ చిత్రం ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల వసూళ్లతో దూసుకుపోతోంది. రణబీర్ కపూర్, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. రణబీర్, బాబీడియోల్ తమ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సినిమాపై సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ ‘యానిమల్’ చిత్రంగురించి స్పందించాడు. “ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలేదు” అని సూటిగా చెప్పాడు సన్నీ.

యానిమల్ సినిమాలోని కొన్ని సన్నివేశాలు చాలామందికి నచ్చలేదు. ఇప్పటికే ఈ సినిమా పై చాలా విమర్శలు వచ్చాయి. అలాగే సన్నీ డియోల్ కూడా ఈ సినిమా పై స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సన్నీ డియోల్ మాట్లాడుతూ యానిమల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘‘బాబీ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. అతను నటించిన ‘యానిమల్‌’ సినిమా చూసా నాకు నచ్చింది. ఇది మంచి సినిమా. అయితే ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మాత్రం నాకు నచ్చలేదు. అంతే కాదు నా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు కూడా నాకు నచ్చవు. ఒక ప్రేక్షకుడిగా.. ఆ విషయాలను ఇష్టపడే లేదా ఇష్టపడని హక్కు నాకు ఉంది” అనిచెప్పుకొచ్చాడు సన్నీ.

సన్నీ డియోల్‌కి బాబీ డియోల్ అంటే ప్రత్యేకమైన ప్రేమ. ‘యానిమల్’ సినిమా చూశాక ఆ ప్రేమ, గౌరవం పెరిగింది. సన్నీ అతనికి కొత్త పేరు కూడా పెట్టింది. ఇది మంచి సినిమా. దాని సంగీతం బాగుంది. బాబీ ఎప్పుడూ బాబీనే. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత లార్డ్ బాబీగా మారాడు’ అని చెప్పాడు సన్నీ డియోల్. సన్నీ డియోల్, బాబీ డియోల్ అన్నదమ్ములు. ఈ ఏడాది ఇద్దరూ భారీ విజయాలు సాధించారు. సన్నీ డియోల్ నటించిన ‘గదర్ 2’ ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది. బాబీ డియోల్ నటించిన ‘యానిమల్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.500కోట్లు వసూల్ చేసింది.యానిమల్ సినిమా ఇప్పటికే ఇండియాలో 476 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ వారాంతంలో సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఈ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.772 కోట్లు రాబట్టింది. ‘అర్జున్‌రెడ్డి’, ‘కబీర్‌సింగ్‌’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘యానిమల్‌’. రణబీర్ కపూర్ చాలా షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. రష్మిక మందన్న, త్రిప్తి దిమ్రీ, అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరపత్రాల్లో నటించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..