ఇటీవల విడుదల అయిన బేబీ సినిమా పై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉన్నాయని అన్నారు. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్ చేసినప్పుడు అక్కడ ఉన్న సన్నివేషాలు.. బేబీ సినిమాలో కనిపించాయని.. సినిమా చూసే నిండితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని తెలిపారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు కనీసం కాషాన్ (కనీస హెచ్చరిక) వెయ్యకుండా డైరెక్ట్ ప్లే చేశారు. మళ్లీ మేము హెచ్చరిస్తే కాషాన్ లైన్ (కనీస హెచ్చరిక లైన్) వేశారని అన్నారు. బేబీ చిత్రబృందానికి నోటీసులు జారీ చేస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇక పై అన్ని సినిమాల పై ఫోకస్ పెడతామని.. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని అన్నారు.
ఇదిలా ఉంటే.. గురువారం గుడి మల్కాపురం పోలీసులతో కలిసి నార్కోటిక్ అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ముగ్గురు నైజీరియన్లతోపాటు.. సినీ నిర్మాత సుశాంత్ రెడ్డిని, రాంచంద్ ను అరెస్ట్ చేశారు. ఇక ఈ కేసులో కన్స్యూమ్ గా నవదీప్ ఉన్నారని.. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని అన్నారు. అయితే డ్రగ్స్ కేసు వార్తలపై హీరో నవదీప్ స్పందించారు. పోలీసులు చెప్పిన నవదీప్ తాను కాదని.. అయిన తన పేరు ఎందుకు తీశారో అర్థం కాలేదని అన్నారు. ప్రస్తుతం తన ఫోన్స్ అన్ని ఆన్ లో ఉన్నాయని.. నవదీప్ అంటే తాను ఒక్కడినే కాదని అన్నారు.
డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతోపాటు భారీగా వసూళ్లు రాబట్టింది. ఇందులో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. వీరి ముగ్గురి నటనకు సినీ విమర్శకులు, అడియన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక అటు థియేటర్లలోనే కాకుండా.. ఇటు ఓటీటీలోనూ ఈ చిత్రానికి రెస్పాన్స్ ఎక్కువగానే వచ్చింది. ఇక ఈ చిత్రంలోని సాంగ్స్, మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.