Tollywood: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఉన్నాడంటూ వార్తలు.. అతడి రెస్పాన్స్ ఇదే..
గురువారం గుడి మల్కాపురంలో పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ ధికారులు ముగ్గురు నైజీరియన్లతోపాటు సినీ నిర్మాత సుశాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతను నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన నిజాలను బయటపెట్టారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. గత కొన్ని నెలలుగా ఈ కేసులో పలు సంచలన విషయాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురు స్టార్ సెలబ్రెటీలను విచారించారు పోలీసులు. ఇక కొద్ది రోజుల క్రితం నిర్మాత కేజీ చౌదరిని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉలిక్కిపడింది. ఇక తాజాగా మరోసారి ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం తెరపైకి వచ్చింది. గురువారం గుడి మల్కాపురం పోలీసులతో కలిసి ఆపరేషన్ నిర్వహించిన నార్కోటిక్స్ అధికారులు ముగ్గురు నైజీరియన్లతోపాటు సినీ నిర్మాత సుశాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సుశాంత్ రెడ్డి అనే నిర్మాతను నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. అలాగే డ్రగ్స్ కొంటున్న మరో అయిదుగురు కస్టమర్లను అరెస్ట్ చేశారు. ఈ కేసుపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన నిజాలను బయటపెట్టారు.
ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసులో ఉన్నవారి పేర్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయని అన్నారు సీపీ ఆనంద్. అలాగే మదాపూర్ లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుందని.. అందులో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి మొబైల్స్ సీజ్ చేసినట్లు తెలిపారు. బెంగుళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఓ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని.. అలాగే నైజీరియన్స్ వీసా గడువు ముగిసిన దేశంలో ఉన్నారని తెలిపారు.
టాలీవుడ్ హీరో నవదీప్ డ్రగ్స్ కన్స్యూమ్ చేసినట్టు తెలిపారు హైదరాబాద్ పోలీసులు. ఆయన స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం నవదీప్ ను కన్స్యూమర్ గా తేల్చారు. ప్రస్తుతం హీరో నవదీప్ పరారీలో ఉన్నారని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని అన్నారు.
గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఎక్సైజ్తో పాటు ఈ డి విచారణకు హాజరయ్యారు నవదీప్.
ఇదిలా ఉంటే తన గురించి వస్తోన్న వార్తలపై హీరో నవదీప్ స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. తన ఫోన్ లన్ని ఆన్ లో ఉన్నాయని అన్నారు. తాను కూడా సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ చూశానని.. కానీ పోలీసులు నా పేరు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. నవదీప్ అని మాత్రమే పోలీసులు చెప్పారు హీరో నవదీప్ అని ఎక్కడ చెప్పలేదు. నవదీప్ అంటే నేను ఒక్కడినే కాదని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.