AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hum Do Hamare 12: హమ్ దో హమారే బరాహ్‌ వివాదం.. పోలీసులను ఆశ్రయించిన చిత్రయూనిట్.. అసలేం జరిగిందంటే..

పోలీసులు, హోంశాఖ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మధ్యే నాసిక్‌లో కొన్ని మత సంస్థలు సినిమాపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ సినిమా జూన్ 7న విడుదల కావాల్సి ఉండగా అంతకుముందే ఈ సినిమా వివాదాల్లో కూరుకుపోయింది. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా టీజర్‌ ఉందని,

Hum Do Hamare 12: హమ్ దో హమారే బరాహ్‌ వివాదం.. పోలీసులను ఆశ్రయించిన చిత్రయూనిట్.. అసలేం జరిగిందంటే..
Hum Do Hamare 12 Film
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: May 29, 2024 | 8:20 PM

Share

హమ్ దో హమారే బరాహ్‌ సినిమాపై వివాదం నెలకొంది. వచ్చేనెల విడుదలకానున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ముస్లింలను ఉద్దేశించి ఈ సినిమాను బ్యాన్‌ చేయాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ముస్లింలలో మహిళలను కేవలం పిల్లలను కనేవారిగానే చేస్తున్నారని, దేశ జనాభా కూడా పెరుగుతోందంటూ.. ముస్లిం సంప్రదాయాలను కించపరిచే ఉద్దేశంతోనే చిత్రం నిర్మించారంటూ మండిపడుతున్నారు. సినిమాను బ్యాన్‌ చేయాలంటూ ముస్లిం సంఘాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అన్నూ కపూర్ నటించిన ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సినిమా ట్రైలర్‌ విడుదల కావడంతో ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. సినిమాలో నటించిన వారికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ కాల్స్‌ చేసి బెదిరిస్తున్నారని.. చిత్ర బృందంతో పాటు దర్శకుడు ముంబై పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు, హోంశాఖ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఈ మధ్యే నాసిక్‌లో కొన్ని మత సంస్థలు సినిమాపై నిరసన వ్యక్తం చేశాయి. ఈ సినిమా జూన్ 7న విడుదల కావాల్సి ఉండగా అంతకుముందే ఈ సినిమా వివాదాల్లో కూరుకుపోయింది. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా టీజర్‌ ఉందని, మనోభావాలను దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలను చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున ఈ చిత్రాన్ని నిషేధించాలని మత సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతేకాకుండా సోషల్‌ మీడియా నుంచి సినిమా టీజర్‌ను తీసేయాలని హెచ్చరిస్తున్నారు. టీజర్‌ను తొలగించకుంటే చట్టపరంగా ముందుకెళ్తామని పలువురు అంటున్నారు. అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ కూడా సినిమా విడుదలపై నిషేధం విధించాలని మహారాష్ట్ర డిమాండ్ చేసింది.

దివంగత ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ అనుచరులు, ముఫ్తీ సల్మాన్ అజారీ స్థాపించిన రాడికల్ తెహ్రీ క్-ఎ-లబ్బైక్ కూడా సోషల్‌ మీడియా చిత్ర యూనిట్‌పై బెదిరింపులకు దిగింది. సినిమాను ఆపకుండా చంపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అన్నూ కపూర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో, ఫోన్లలో బెదిరిస్తున్నారని అన్నారు. సినిమా చూడకుండా ఎలాంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారతపైనే సినిమా తీశామని, జనాభా నియంత్రణ గురించి చాటి చెప్పడమే ఉద్దేశమన్నారు. ఏ మతాన్ని కించపరచడం, అవమానించడం మా ఉద్దేశం కాదని అన్నూ చెప్పారు. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన హమ్ దో హమారే బరాహ్‌ చిత్రం జూన్ 7న విడుదల కానుంది. ఈ చిత్రంలో అన్నూ కపూర్, పార్థ్ సమతాన్, అశ్విని కల్సేకర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి, రాహుల్ బగ్గా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.