Ante Sundaraniki: టీజర్‌తోనే రచ్చ చేస్తోన్న సుందరం.. నాని హవా మాములుగా లేదుగా..
న్యాచురల్ స్టార్ నాని (Nani).. మలయాళం బ్యూటీ నజ్రియా (Nazria Nazim) జంటగా నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ.
న్యాచురల్ స్టార్ నాని (Nani).. మలయాళం బ్యూటీ నజ్రియా (Nazria Nazim) జంటగా నటిస్తోన్న చిత్రం అంటే సుందరానికీ. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను జూన్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక నిన్న విడుదలైన నేచురల్ స్టార్ నాని ”అంటే.. సుందరానికీ” టీజర్ నవ్వులు పూయించింది. నాని నుంచి వినోదాత్మక చిత్రాలు ఆశించే ప్రేక్షకులు సుందరం పాత్ర కావలసినంత వినోదం పంచుతుందనే భరోసా ఈ టీజర్ ఇచ్చింది. వివేక్ ఆత్రేయ తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ సినిమా టీజర్‌కు అన్ని వర్గాల ప్రేక్షకులు నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.
‘అంటే.. సుందరానికీ’ టీజర్ రికార్డ్ వ్యూస్ సాధించింది. కేవలం 24 గంటల్లో టీజర్ వీడియోకు 11 మిలియన్ల వ్యూస్ దక్కాయి. నాని కెరీర్ ఇదే హయ్యెస్ట్ వన్ డే రికార్డ్. యూట్యూబ్‌లో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్‌లో ఉన్న టీజర్ కి 366K+ లైక్స్ సొంతం చేసుకుంది. టాప్ పాన్ ఇండియా సినిమాల టీజర్ సమానంగా ‘అంటే సుందరానికీ’ టీజర్ వ్యూస్, లైక్స్ దక్కించుకోవడం విశేషం. టీజర్ కి వచ్చిన వ్యూస్ లైక్స్ చూస్తుంటే సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధమౌతుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈ చిత్రంలో నానిని క్రిస్టియన్ అమ్మాయి నజ్రియా ప్రేమలో పడ్డ బ్రాహ్మణ కుర్రాడిలా విభిన్న పాత్రలో ప్రజంట్ చేశారు. టీజర్ లో లవ్ ట్రాక్ చాలా కొత్తగా ఫ్రెష్ అండ్ ప్లజంట్ గా అనిపించింది. టీజర్ ని చాల ఇంట్రస్టింగ్ గా ప్రజంట్ చేశారు. టీజర్ మొత్తం నవ్వులు పూయిస్తూనే టైటిల్ లో వున్న ”అంటే…”కి సమాధానం ప్రేక్షకుడి గెస్సింగ్ కి వదిలి ఆసక్తిని పెంచగా, కథలో మరో కీలకమైన అంశం వుందని హింట్ ఇచ్చేలా టీజర్ డిజైన్ చేయడం ఆకట్టుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, నికేష్ బొమ్మి సినిమాటోగ్రఫర్ గా, రవితేజ గిరిజాల ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి ‘అడాడే సుందరా’ అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి ‘ఆహా సుందరా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
What phenomenal response this has been for Sundar, Leela and their Story ❤️
11M+ views for Teaser & Trending #1 ?
– https://t.co/yfApzip3fb#AnteSundaraniki #AhaSundara #AdadeSundara
Natural ⭐ @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @saregamasouth pic.twitter.com/TjDWn8gcmc
— Mythri Movie Makers (@MythriOfficial) April 21, 2022
Samantha : విజయ్ దేవరకొండతో సామ్ సినిమా.. ఘనంగా మూవీ లాంచ్.. ఎక్కడా కనిపించని హీరోయిన్.. ఎందుకంటే..
Kajal Aggarwal: బిడ్డ పుట్టాక కాజల్ భావోద్వేగ పోస్ట్.. కష్టమంతా మర్చిపోయానంటూ..
RRR OTT: ఇక ఓటీటీ వంతు.. డిజిటల్ స్క్రీన్‌పై ట్రిపులార్ సందడి చేసేది ఆ రోజే.. ఎప్పుడు, ఎక్కడా.?