War 2 Movie: హృతిక్ – ఎన్టీఆర్ ‘వార్ 2’ ట్రైలర్ వచ్చేస్తోంది.. థ్రిల్‌కు రెడీ అవ్వండి..!

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వార్ 2 ఒకటి. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

War 2 Movie: హృతిక్ - ఎన్టీఆర్ ‘వార్ 2’ ట్రైలర్ వచ్చేస్తోంది.. థ్రిల్‌కు రెడీ అవ్వండి..!
War 02

Edited By:

Updated on: Jul 15, 2025 | 5:45 PM

బాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను సృష్టించిన ‘వార్’ (2019) కు సీక్వెల్‌గా వస్తున్న ‘వార్ 2’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం, ఇప్పటి నుంచే భారీ అంచనాలను సృష్టిస్తోంది. హృతిక్ రోషన్ మరోసారి ఏజెంట్ కబీర్ గా స్క్రీన్ మీద చెలరేగబోతుండగా, ఈ సారి అతన్ని ఢీకొట్టే మాస్ పవర్‌గా ఏజెంట్‌ విక్రమ్‌ కేరక్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. దర్శకుడు అయ్యన్ ముఖర్జీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా, YRF స్పై యూనివర్స్ లో ఆరవ భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదిరిపోయే యాక్షన్, గ్రాండ్ స్కేల్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్ ఉండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్‌ అయింది.

ఆల్రెడీ రిలీజ్‌ అయిన ట్రైలర్‌ చూసిన వారందరికీ గూస్‌బంప్స్ వచ్చేశాయి. అంతకు మించిన ఎగ్జయిట్‌మెంట్‌ క్రియేట్‌ చేయడానికి వచ్చే వారం ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 3 నిమిషాల పాటు ఉంటుంది ట్రైలర్‌. ఈ ట్రైలర్ లో హృతిక్, ఎన్టీఆర్, కియారా అద్వానీ పాత్రల లుక్స్ పూర్తిగా రివీల్ చేయబోతున్నాయట.

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ అనగానే ముందు సాంగ్స్ రిలీజ్‌ చేయడం, ఆ తర్వాత ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం.. అనేది ప్రేక్షకులకు అలవాటైన విధానం. కానీ, వార్‌2 విషయంలో మాత్రం వైవిధ్యంగా అడుగులు వేస్తోందీ సంస్థ. ముందు ట్రైలర్‌ రిలీజ్‌ చేసి, ఆ తర్వాత సాంగ్స్ అనే ట్రెండ్‌ని అలవాటు చేసుకుంటోంది. ఈ ట్రెండ్‌ ప్రేక్షకులకు సినిమా మీద మరింత అవగాహన కలిగించడానికి ఉపయోగపడుతుందన్నది యూనిట్‌ నమ్మకం. వార్‌2 ఎంట్రీలో వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్ చూసి ఎగ్జయిట్‌ అయ్యానని రీసెంట్‌గా సూర్యదేవర నాగవంశీ అన్నారు. అంతే కాదు, సినిమాలో ఇద్దరు హీరోలకు ఈక్వెల్‌ స్క్రీన్‌ స్పేస్‌ ఉంటుందని చెప్పారు. తారక్‌ కాసేపే కనిపిస్తారనడంలో ఏమాత్రం నిజం లేదని డిక్లేర్‌ చేశారు నాగవంశీ. వార్‌2లో ఆరు భారీ యాక్షన్‌ సీక్వెన్స్ లు ఉంటాయన్నది టాక్‌. స్పెయిన్‌, అబుదాబీ, ఇటలీ, కశ్మీర్‌లో కీలక సన్నివేశాలను, యాక్షన్‌ సీక్వెన్స్ నీ తెరకెక్కించారు. స్పై థ్రిల్లర్‌ సీక్వెన్స్ అంటే ఇలాగే ఉండాలని రీడిఫైన్‌ చేసేలా యాక్షన్‌ బ్లాక్స్ ఉంటాయని ఊరిస్తోంది యూనిట్‌.

ఇవి కూడా చదవండి

Telugu Cinema: 16 ఏళ్లకే హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 20 ఏళ్లకే తల్లైంది.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు యాక్టర్..

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ సాంగ్స్ కి స్పెషల్‌ ఆడియన్స్ ఉన్నారు. వాళ్లకి నచ్చేలా హృతిక్‌ – కియారా మధ్య ఓ రొమాంటిక్‌ ట్రాక్‌ని ప్లాన్‌ చేశారు. హృతిక్‌ – తారక్‌ డ్యాన్సింగ్‌ స్కిల్స్ ని ఎలివేట్‌ చేసే సాంగ్‌ షూటింగ్‌ రీసెంట్‌గా కంప్లీట్‌ అయింది. ప్రీతమ్‌ అందించిన బీట్స్ మామూలుగా లేవన్నది నార్త్ టాక్‌.

ఇవి కూడా చదవండి : 

Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?

Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..

Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్‏లోకి సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ.. నెట్టింట ఫుల్ లిస్ట్ లీక్.. ఇక రచ్చే..