Silk Smitha: మేడమ్ సర్ మేడమ్ అంతే.. ఒక్కో పాటకు సిల్క్ స్మిత తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే.. అప్పట్లోనే..
80వ దశకంలో దక్షిణాది సినిమాల్లో చక్రం తిప్పిన హీరోయిన్. మత్తెక్కించే నిషా కళ్లు.. గ్లామర్ లుక్స్.. అద్భుతమైన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో సినీప్రియులను కట్టిపడేసేది. అప్పట్లో స్పెషల్ పాటలకు ఆమె కేరాఫ్ అడ్రస్. అంతేకాదు.. ఒక్కో సాంగ్ చేయడానికి భారీగా పారితోషికం తీసుకునే హీరోయిన్ సైతం ఆమెనే. అది కూడా స్టార్ హీరోయిన్లకు మించి పారితోషికం తీసుకునేదట.

సిల్క్ స్మిత ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో స్పెషల్ సాంగ్స్ ద్వారా మరింత పాపులర్ అయ్యింది. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో ముఖ్య పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసి ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అప్పట్లోనే ఆమె కోసం స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసేవారంటే ఆమె స్టార్ డమ్ ఓ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సౌత్ ఇండస్ట్రీలో మొత్తం 450కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. భర్త, అత్తగారింటి వేధింపులు తాళలేక ఇంటి నుంచి పారిపోయిన ఆమె సినీరంగంలో టచ్ ఆప్ ఆర్టిస్టుగా పనిచేసింది. అదే సమయంలో ఇనయే తేడి అనే మలయాళం చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమాతోనే ఆమెకు నటిగా ఆఫర్ ఇచ్చారు దర్శకుు ఆంటోని ఈస్ట్ మన్.
ఆ తర్వాత నెమ్మదిగా తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ఆఫర్స్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. చాలా సినిమాల్లో హీరోయిన్ గా.. మరోవైపు స్పెషల్ సాంగ్స్ ద్వారా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది సిల్క్ స్మిత. 80, 90వ దశకాల్లో ఆమె అగ్రతారగా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి. స్టార్ హీరోయిన్స్ సైతం సిల్క్ స్మిత క్రేజ్ కోసం ఆరాటపడేవారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపే సిల్క్ స్మిత డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు. అప్పట్లో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి సిల్క్ స్మిత రూ.50వేల వరకు పారితోషికం తీసుకునేదట. అప్పట్లో ఒక్క పాటకు రూ.50 వేలు అంటే ఇప్పుడు రూ.5 కోట్లతో సమానం.
ఇక హీరోయిన్ గానూ భారీగానే పారితోషికం తీసుకునేవారట. సహయ నటిగా, కథానాయికగా, విలన్ పాత్రలతో అలరించిన సిల్క్ స్మిత.. ఆ తర్వాత ప్రేమలో మోసం పోయింది. అలాగే స్నేహితులు సైతం మోసం చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఒంటరితనంతో 35 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. కానీ ఇప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమె బయోగ్రఫీపై ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..