Kalyani: ఒకప్పటి క్రేజీ హీరోయిన్ కళ్యాణి.. ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో తెలుసా..?

పాత సినిమాల్లో హీరోయిన్స్ గురించి ఎక్కువ మంది గూగుల్ లో గాలిస్తున్నారు. చాలా మంది అప్పటి  హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు అని తెగ వెతుకుతుంటారు.

Kalyani: ఒకప్పటి క్రేజీ హీరోయిన్ కళ్యాణి.. ఇప్పుడు ఎలా ఉందో..? ఏం చేస్తుందో తెలుసా..?
Kalyani
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 19, 2023 | 12:19 PM

సినిమా హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. రకరకాల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక పాత సినిమాల్లో హీరోయిన్స్ గురించి ఎక్కువ మంది గూగుల్ లో గాలిస్తున్నారు. చాలా మంది అప్పటి  హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు అని తెగ వెతుకుతుంటారు. ఈ క్రమంలోనే పై ఫొటోలో  కనిపిస్తోన్న మరో హీరోయిన్ గురించి ఇప్పుడు నెటిజన్స్ వెతుకుతున్నారు. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పేరు కళ్యాణి. ఒకప్పుడు క్రేజీ హీరోయిన్ గా రాణించింది కళ్యాణి. చూడచక్కని రూపం, చక్కటి అభినయంతో అలరించారు కళ్యాణి.

కళ్యాణి కావేరి అని కూడా పిలుస్తుంటారు. బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన కళ్యాణి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. రాజశేఖర్ హీరోగా వచ్చిన శేషు సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఇక ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి గాను ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.

తెలుగు శేషు, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, లేత మనసులు, పెళ్లాంతో పనేంటి, ఆపరేషన్ దుర్యోధన , బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, వసంతం లాంటి సినిమాల్లో నటించింది. చాప్టర్-6 అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు కళ్యాణి. ఇక ఆమె తన భర్త సూర్యకిరణ్ తో విడిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు కళ్యాణి ఎలా ఉందో తెలుసా.? ఆమె లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రొడ్యూసర్ గా బిజీగా గడుపుతోంది కళ్యాణి.Kalyani 1

Kalyani 1

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ