ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను ఇటు తెలుగులోకి డబ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు వస్తుంది. దీనిని తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. అదే ‘హనీమూన్ ఫోటోగ్రాఫర్’. భార్యతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లిన భర్త.. అక్కడి బీచ్ లో శవమై కనిపిస్తాడు. ఆ హత్య ఎవరు చేశారన్న మిస్టరీని ఛేదించే కథతో ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇందులో ఆశానేగి, సాహిల్ సలాథియా, రాజీవ్ సిద్దార్థ, ఆపేక్ష పోర్వల్ కీలకపాత్రలు పోషించారు. అర్జున్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను సెప్టెంబర్ 27 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సందర్భంగా గురువారం (సెప్టెంబర్ 19న) ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ వీడియోలో ఇరానీ ఫార్మా అధినేత అధీర్ ఇరానీ (సాహిల్) తన భార్యతో కలిసి హనీమూన్ కు మాల్దీవ్ వెళ్తారు. అయితే అక్కడ ఊహించని విధంగా అతడు బీచ్ లో శవమై కనిపిస్తాడు. అతడిని ఎవరు హత్య చేశారన్నది మిస్టరీగా మారుతుంది. అతడి భార్యతోపాటు, మరో స్నేహితుడు, ఫ్యామిలీ మెంబర్.. వాళ్లను ఫాలో చేసే ఓ అపరిచితుడు ఇలా మొత్తం నలుగురు అనుమానితులు ఉంటారు. వీరిలో ఎవరు అతడిని హత్య చేశారన్నది ఈ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఇందులో ఆశా నేగి ఫోటోగ్రఫర్ అంబికానాథ్ అనే పాత్రలో కనిపించింది. కొత్తగా పెళ్లైన జంట హనీమూన్ ఫోటోస్ తీస్తూ ఉంటుంది. ఈ హత్య ఆమె పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తారు.
ఇటీవల కొన్నాళ్లుగా ఓటీటీల్లో హరర్, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డరీ మిస్టరీ కంటెంట్ చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఊహించని ట్విస్టులతో కూడిన మర్డరీ మిస్టరీని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేసింది.
ట్వీట్..
Ek photographer, ek picture-perfect honeymoon aur ek deadly secret🔪 Who's the killer? #HoneymoonPhotographer, streaming 27 September onwards, exclusively on JioCinema Premium.@AshaNegi7 @ApekshaPorwal #RajeevSiddhartha @SalathiaSahil @JasonThamIndia @Sushmitha_S… pic.twitter.com/VQArQmcEUS
— JioCinema (@JioCinema) September 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.