Honey Rose: ‘ఆ కమెడియన్ బాడీ షేమింగ్ చేస్తే యాంకర్ నవ్వింది.. బాధేసింది’.. హానీరోజ్..
ఎప్పటికప్పుడు లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అయితే ఇక నెట్టింట ఈ బ్యూటీ గురించి ఎక్కువగానే చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ అమ్మడు వస్త్రధారణపై విమర్శలు వస్తుంటే.. వాటికి తన స్టైల్లో కౌంటరిస్తుంటుంది. తాజాగా తాను కూడా బాడీ షేమింగ్ కామెంట్స్.. ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది హనీరోజ్.
నందమూరి బాలకృష్ణ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహా రెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటించగా.. మరో హీరోయిన్ గా హానీ రోజ్ కనిపించింది. ఈ మూవీతో హనీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పటివరకు ఈ బ్యూటీ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు.. కానీ నెట్టింట మాత్రం ఈ ముద్దుగుమ్మ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. అయితే ఇక నెట్టింట ఈ బ్యూటీ గురించి ఎక్కువగానే చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ అమ్మడు వస్త్రధారణపై విమర్శలు వస్తుంటే.. వాటికి తన స్టైల్లో కౌంటరిస్తుంటుంది. తాజాగా తాను కూడా బాడీ షేమింగ్ కామెంట్స్.. ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది హనీరోజ్.
“సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ఎప్పుడూ ట్రోల్స్ జరుగుతుంటాయి. అయితే అందులో కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి.. మరికొన్ని మాత్రం మనసుకు బాధ కలిగిస్తాయి. నా శరీరాకృతి గురించి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంటే చాలా బాధేసేది. ఇప్పుడిప్పుడే అలాంటివాటిని పట్టించుకోవడం మానేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ టీవీ షోకు వెళ్లినప్పుడు అక్కడ ఓ కమెడియన్ నన్ను బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. ఆ మాటలు విని యాంకర్ గట్టిగా నవ్వింది.
మహిళా యాంకరే నా మీద వస్తున్న కామెంట్స్ విని నవ్వడం నచ్చలేదు.. అతను బాడీ షేమింగ్ చేస్తుంటే టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ” అంటూ తన మనసులోని బాధను బయటపెట్టింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.