Cinema: ‘ధురంధర్ 2’ను తట్టుకుని మరీ.. బాక్సాఫీస్‌ను రప్ఫాడిస్తోన్న సినిమా.. 10 రోజుల్లోనే 2800 కోట్లు
ప్రస్తుతం ఎక్కడ చూసిన ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2 ) సినిమా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా రూ.2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా ధాటికి ఇతర సినిమాలు కనీసం పోటీలో లేకుండా పోతున్నాయి.

ధురంధర్ ది రివేంజ్ (ధురందర్ 2) కలెక్షన్ల సునామీ ఇప్పట్లో ఆగడం లేదు. మార్చి 19న విడుదలైన ఈ క్రేజీ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.1500 కోట్లను దాటేసిన ధురంధర్ 2 రూ.2000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సినిమా ధాటికి ఇతర చిత్రాలు తట్టుకోలేకపోతున్నాయి. కనీసం పోటీలో లేకుండా పోతున్నాయి. అయితే ఈ ధురంధర్ 2 ప్రభంజనంలోనూ ఒక సినిమా కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తోంది. విదేశాల్లో వారం క్రితమే థియేటర్లలో రిలీజై అద్భుతమైన టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా గత వీకెండ్ మన దేశంలోనూ విడుదలైంది. అద్భుతమైన మౌత్ టాక్‌తో ధురంధర్ 2 పోటీని తట్టుకుని మరీ ఈ సినిమా కలెక్షన్లు రాబడుతోంది. ఇంతకీ ఈ సినిమా ఏదనుకుంటున్నారా? ప్రస్తుతం ఇండియాలో రణ్ వీర్ సింగ్ ధురంధర్ 2 సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మాత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఆడియెన్స్ కు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తూ వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తోంది.
అమెరికాలో పదిరోజుల క్రితం రిలీజైన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు $300 మిలియన్లకు పైగా (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.2800 కోట్లు) వసూళ్లు సాధించింది. రోజు రోజుకు ఈ సినిమ వసూళ్లు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు. ఇక మన దేశంలోనూ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ మూవీకి అనూహ్యమైన ఆదరణ దక్కుతోంది. కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే ఈ సినిమాను ప్రదర్శిస్తున్నప్పటికీ కేవలం నాలుగు రోజుల్లోనూ రూ. 18 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చాలా చోట్ల ఎర్లీ మార్నింగ్ షోలకు కూడా హౌస్‌పుల్స్ పడుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా వీకెండ్‌లో మరిన్ని వసూళ్లను సాధించే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ సినిమా కథ విషయానికొస్తే.. రేల్యాండ్ గ్రేస్ అనే ఓ వ్యోమగామి తన గతాన్ని మర్చిపోతాడు. ఊహించని విధంగా అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. అలాంటి ఇతడు తన తెలివితేటలు ఉపయోగించి, ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? అనేది ఈ సినిమా కథ. కంటెంట్ పరంగా ఓకే అని టాక్ వస్తున్నప్పటికీ ఈ సినిమాలో విజువల్స్ అదిరిపోయాయని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు.
@VALORANT @ValorantEsports @projecthailmary is this tuff #projecthailmary pic.twitter.com/7WjmplU9gZ
— project hail meiy #slurpbyslurp 🍜🚂🇭🇰 (@meiyisms) April 2, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




