AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malaika Arora: పాతికేళ్ల బామలా కనిపించే మలైకా.. ఆమె డైట్ సీక్రెట్ తెలుసా?

ఐదు పదుల వయసులోనూ ఫిట్‌గా, యంగ్‌గా కనిపించే మలైకా అరోరా తన ఆరోగ్య రహస్యాలను వెల్లడించారు. ఇంటి ఆహారం, పోర్షన్ కంట్రోల్ కోసం ప్లేట్‌కు బదులుగా చిన్న గిన్నెలో భోజనం చేయడం, సరిపడా నిద్ర, యోగా వంటి అలవాట్లే తన ఫిట్‌నెస్‌కు కారణమని ఆమె చెప్పారు. ఈ అలవాట్లు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో నిపుణులు కూడా వివరించారు.

Malaika Arora: పాతికేళ్ల బామలా కనిపించే మలైకా.. ఆమె డైట్ సీక్రెట్ తెలుసా?
Malaika Arora Fitness And Diet Secret
Janardhan Veluru
|

Updated on: Jul 03, 2026 | 4:20 PM

Share

ఐదు పదుల వయసులోనూ బాలీవుడ్ నటి మలైకా అరోరా తన ఫిట్‌నెస్, అందంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పాతికేళ్ల బామలా కనిపించే ఆమె ఫిట్‌నెస్, డైట్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. గతంలో పలు సందర్భాల్లో మలైకా తన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. డైట్‌తో పాటు ఫిట్‌నెస్ కోసం ఆమె ఇచ్చిన సూచనలు, సలహాలకు వైద్య నిపుణులు కూడా మద్దతు ఇస్తున్నారు.

ఇంటి వంటే బెస్ట్ ఫుడ్

మలైకా అరోరా బయట ఆహారం కంటే ఇంట్లో తయారుచేసిన సాధారణ ఫుడ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. సమతుల్యమైన, పోషకాలు కలిగిన భోజనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆమె చెబుతున్నారు. అంతేకాకుండా నెయ్యిని తన డైట్‌లో ముఖ్యమైన భాగంగా తీసుకుంటానని, దానిని “సూపర్ ఫుడ్”గా భావిస్తానని వెల్లడించారు.

చిన్న గిన్నెలోనే భోజనం

మలైకా పాటించే ముఖ్యమైన అలవాట్లలో ఒకటి పోర్షన్ కంట్రోల్. తాను చాలా అరుదుగా ప్లేట్‌లో తింటానని, ఎక్కువగా చిన్న గిన్నెలోనే ఆహారం తీసుకుంటానని చెప్పారు. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా నియంత్రించుకోవచ్చని, అవసరమైనంత మాత్రమే తీసుకునే అలవాటు ఏర్పడుతుందని ఆమె వివరించారు. భోజనం చేసే ప్లేట్ విషయంలో ఈ చిన్న మార్పే బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మంచి నిద్ర ఫిట్‌నెస్‌లో భాగమే

వ్యాయామంతో పాటు సరైన నిద్ర కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమని మలైకా పేర్కొన్నారు. నిద్రను చాలామంది నిర్లక్ష్యం చేస్తారని, కానీ శరీరం పునరుత్తేజం చెందేందుకు నాణ్యమైన నిద్ర తప్పనిసరి అని చెప్పారు.

యోగా, యాక్టివ్ లైఫ్‌స్టైల్

రోజూ శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు యోగా, తేలికపాటి వ్యాయామాలు చేయడం తన దినచర్యలో భాగమని మలైకా తెలిపారు. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి, దానికి అనుగుణంగా జీవనశైలిని మార్చుకోవాలని ఆమె సూచించారు.

ఫిట్‌నెస్ కోసం మలైకా అరోరా సూచనలతో వైద్య నిపుణులు కూడా ఏకీభవిస్తున్నారు. దీంతో పాటు రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా జీర్ణక్రియ, జీవక్రియ (మెటబాలిజం) కూడా మెరుగుపడుతుంది.

సోషల్ మీడియా డైట్ టిప్స్‌తో జాగ్రత్త

ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్యాడ్ డైట్లు లేదా అతిగా క్యాలరీలు తగ్గించే పద్ధతులను గుడ్డిగా అనుసరించవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడం అనేది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు. సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, సరిపడా నిద్ర, మంచి జీవనశైలి కలిసి మాత్రమే దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అందిస్తాయి. అవసరమైతే డాక్టర్ లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Also Read: గోధుమ రోటీలు, చపాతీలు తింటున్నారా..? ఈ ఆయుర్వేద నియమాలు తెలుసుకోండి

(ఈ కథనంలోని సమాచారం ప్రజలకు అందుబాటులో ఉన్న వివరాలు, నిపుణుల సూచనల ఆధారంగా రూపొందించబడింది. ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా ఆహార మార్పులు లేదా డైట్‌ను ప్రారంభించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది)

Follow Us