AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rain Alert: బలపడతున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..!

AP Weather Alert: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో ఏపీలోని అల్లురి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీరం వెంబడి 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.

AP Rain Alert: బలపడతున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..!
Ap Rain Alert
Janardhan Veluru
|

Updated on: Jul 03, 2026 | 7:29 PM

Share

వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాబోయే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపింది.  దీని ప్రభావంతో శనివారం (04 జూన్) అల్లురి, ఏలూరు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.

శనివారం మేఘావృతమైన వాతావరణంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు.

Follow Us
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..
ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ సునామీ.. 12 గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్..
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?
శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?
ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో
ఆరోగ్యానికి మంచిదని చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. ఎంత డేంజరో
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
పట్టాలపై తాగుబోతు..చివరి నిమిషంలో చూసిన డ్రైవర్‌! ఆ తర్వాత
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
సత్యసాయి గ్రామంలో ముగిసిన అంతర్జాతీయ విలువల విద్యా సదస్సు..
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
నిరసనల మధ్య మానవత్వం.. జవాన్లకు పిజ్జా పంచిన యువకుడు!
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
కరకరలాడే పనీర్ టిక్కా తినాలని ఉందా?.. సింపుల్ రెసిపీ
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
భార్య పేరు మీద నెలకు రూ.8,000 జమ చేస్తే ఐదేళ్లలో ఎంత వస్తుంది?
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
చిన్నారులతో సరదాగా గడిపిన మంచు లక్ష్మి.. వీడియో
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!
వామ్మో.. ఆ వయసులో ఈ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదం..!