AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..

హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు భారీ ప్రణాళికలు రూపొందింది. అందులో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ నిర్మించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు తెలంగాణ టూరిజం శాఖ ప్రణాళికలు రచిస్తోంది.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు అదిరే న్యూస్.. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. మరింత ఆహ్లాదకరంగా..
Hussain Sagar
Venkatrao Lella
|

Updated on: Jul 03, 2026 | 7:04 PM

Share

హైదరాబాద్ ప్రజలకు సూపర్ న్యూస్. నగర వాసులు ఆహ్లాదం కోసం హుస్సేన్ సాగర్ వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి ట్యాంక్ బండ్ చుట్టేస్తూ ఉంటారు. అయితే హుస్సేన్ సాగర్‌లో ఇప్పటికే బూటింగ్ సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. హుస్సేన్ సాగర్‌లో విహరిస్తూ బుద్దుడిని చూడాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల బుద్ద విగ్రహాల్లో ఇది ఒకటిగా ఉంది. దీంతో హుస్సేన్ సాగర్‌ను ప్రముఖ టూరిస్ట్ స్పాట్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్ నిర్మించేందుకు సిద్దమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్క్రైవాక్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కైవాక్ ద్వారా సరికొత్త కోణంలో బుద్దుడి విగ్రహాన్ని చూసే అవకాశం లభించనుంది.

ఇక నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద ఉన్న బుద్దవనంలో అంతర్జాతీయ బుద్ద మ్యూజియం, హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుద్దుడి జీవిత వివేషాల శిల్పాలు, మహాస్థూపం వంటివి పర్యాటకులను ఆకర్షించనున్నాయి. దాదాపు 274 ఎకరాల విస్తీర్ణంలో బుద్దవనం నిర్మించారు. దీనిని ఇప్పుడు మరింతగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. తెలంగాణ పర్యాటక అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి. ఇక ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అతిపెద్ద మట్టి స్తూపం కూడా నిర్మించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక వీకెండ్స్‌లో పర్యాటకుల కోసం ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకటి, రెండు రోజులు ప్రత్యేక ప్యాకేజీలకు డిజైన్ చేస్తున్నారు.

హుస్సేన్ సాగర్‌లోని బుద్ద విగ్రహం, నాగార్జునసాగర్ వద్ద ఉన్న బుద్ద వనం, ఫణిగిరి, నేలకొండపల్లి బౌద్ద స్తూపాలను వీక్షించేలా ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున బౌద్ద పర్యాటకులు భారత్‌కు వస్తున్నారు. వారికి ఆకర్షించే విధంగా బౌద్ద, జౌన సర్క్యూట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ది చేయడంతో పాటు విదేశీ పర్యాటకుల రాకతో స్థానిక ప్రాంతాల ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుందని భావిస్తోంది.

Follow Us