AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రహాస్యంగా పెళ్ళిచేసుకున్న ప్రభాస్ హీరోయిన్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్.. పెళ్లికొడుకు ఎవరంటే..

ఇటీవల సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కోక్కరుగా పెళ్ళిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా కన్నడ హీరోయిన్

రహాస్యంగా పెళ్ళిచేసుకున్న ప్రభాస్ హీరోయిన్.. నెట్టింట్లో ఫోటోలు వైరల్.. పెళ్లికొడుకు ఎవరంటే..
Sanjjana Galrani
Rajitha Chanti
|

Updated on: Mar 23, 2021 | 8:22 PM

Share

ఇటీవల సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు బాగానే మోగుతున్నాయి. టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కోక్కరుగా పెళ్ళిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా కన్నడ హీరోయిన్ సంజన గల్రానీ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలుగులో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకుంది సంజన గల్రానీ. ఆ తర్వాత ‘సత్యమేవ జయతే’, ‘అవును 2’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తదితర చిత్రాల్లో నటించారు. ‘స్వర్ణ ఖడ్గం’ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. అయితే ఇక్కడ ఒక్క హిట్ కూడా రాకపోవడంతో అమ్మడు కన్నడకే పరిమితం అయిపోయింది. తాజాగా ఈ అమ్మడు కర్ణాటకలోని డాక్టర్ పాషాను పెళ్ళిచేసుకుంది. వీరి పెళ్లి అతి కొద్ది మంది బంధువులు, స్నేహితులు హజరయ్యారు. ఇక ఈ పెళ్లితోపాటు సంజనా డిజిటల్‌ రంగంలోకి కూడా అడుగు పెడుతుంది. అలాగే ఆత్మనిర్బర్‌ పేరుతో నటీనటుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుంది సంజనా. త్వరలోనే తన డిజిటల్‌ మీడియాకు సంబంధించిన పేరు, ఇతర వివరాలను వెల్లడిస్తానని తెలియజేసింది సంజనా గల్రాని. ఇటీవలే సంజన డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం బెయిల్ పై విడుదలైంది.

Also Read:

టాలీవుడ్‏పై కన్నెసిన తమిళ స్టార్ హీరో.. సరైన పార్టనర్ కోసం వెతుకులాట.. అన్ని కుదిరితే త్వరలోనే ఎంట్రీ..

Ee Kathalo Paathralu Kalpitam Pre Release Event: ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్.. అతిథిగా యంగ్ హీరో..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్