Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్‏పై కన్నెసిన తమిళ స్టార్ హీరో.. సరైన పార్టనర్ కోసం వెతుకులాట.. అన్ని కుదిరితే త్వరలోనే ఎంట్రీ..

అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న హీరోల్లో సూర్య ఒకరు. తమిళంలో తెరకెక్కిన సూర్య సినిమాలు తెలుగులోకి

టాలీవుడ్‏పై కన్నెసిన తమిళ స్టార్ హీరో.. సరైన పార్టనర్ కోసం వెతుకులాట.. అన్ని కుదిరితే త్వరలోనే ఎంట్రీ..
Surya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 7:46 PM

అటు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న హీరోల్లో సూర్య ఒకరు. తమిళంలో తెరకెక్కిన సూర్య సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ అయ్యి విడుదలై.. సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత చేరువయ్యాడు ఈ హీరో. ఇటీవలే సూర్య నటించిన సూరారై పోట్రు సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో విడుదలై.. సూపర్ హిట్‏గా నిలిచింది.  లేడీ డైరెక్టర్ సుధ కొంగరు దర్శకత్వం వహించింది. ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేసిన అద్భుత ప్రజాదరణ సొంతం చేసుకుంది. ప్రతి భాషలోనూ అందరినీ కట్టిపడేసింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ యొక్క నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సూర్య సొంత ప్రొడక్షన్ బ్యానర్, 2 డి ఎంటర్టైన్మెంట్,  సిఖ్యా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళి, మోహన్ బాబు, పరేష్ రావల్, ఊర్వశి, కరునాస్ కూడా నటించారు. ఇక ఇప్పటివరకు సూర్య తమిళంలో తన సినిమాలతోపాటు కొన్ని సినిమాలను నిర్మించాడు. తన తమ్ముడు కార్తీతో కలిసి సూర్య హోం ప్రొడక్షన్ 2D ఎంటర్టైన్మెంట్ కొన్ని సినిమాలను నిర్మించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా సూర్య కన్ను టాలీవుడ్ పై పడినట్లుగా సమాచారం.

తెలుగు హీరోహీరోయిన్లుతో కలిసి పూర్తిగా తెలుగులోనే ఓ సినిమా నిర్మించాలని భావిస్తున్నాడట సూర్య. ప్రస్తుతం విభిన్న కథలపై సూర్య ఫోకస్ పెట్టాడట. అయితే తెలుగులో సినిమా తీసేందుకు అగ్ర నిర్మాతలు, దర్శకుల కోసం సూర్య వెతుకున్నాడట. కొత్త తరహా కథలను ఎంకరేజ్ చేయడానికి సూర్య ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే సింగం డైరెక్టర్ హరితో కూడా మరో సినిమాను పట్టాలెక్కించనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Tiger 3 Movie: సల్మాన్ కోసం సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్లాన్ చేస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ..

Liger Movie Update: విజయ్ దేవరకొండ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. మరింత హింట్ ఇచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ…