Tiger 3 Movie: సల్మాన్ కోసం సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్లాన్ చేస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ..

Salman Khan Tiger 3 Movie Update: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో టైగర్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Tiger 3 Movie: సల్మాన్ కోసం సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్.. ప్లాన్ చేస్తున్న యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ..
Salman Khan Tiger 3 Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 7:01 PM

Salman Khan Tiger 3 Movie Update: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో టైగర్ 3 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన టైగర్ సినిమాకు సీక్వెల్‏గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్‏కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్‏గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ బీటౌన్‏లో చక్కర్లు కొడతుంది.

యశ్ రాజ్ ఫీల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ప్రీతమ్‏ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. గతంలో సల్మాన్ ఖాన్ సినిమాలు బజరంగీ భాయిజాన్, రెడీ వంటి సినిమాలకు ప్రీతమ్ సంగీతాన్ని అందించారు. ఇక ఆ చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో టైగర్ 3 పాటలను కూడా భారీ శ్తాయిలో చిత్రీకరించాలని భావిస్తున్నారట చిత్ర నిర్మాణ సంస్థ. ఇందుకోసం ఎంత బడ్జెట్ అయిన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఇందులో సల్మాన్‏కు ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హాస్మీ నటించనున్నట్లుగా సమాచారం. ఇటీవలే ఈనెల 8న ఈ మూవీ షూటింగ్ ఘనంగా ముంబైలో ప్రారంభమైంది. ఇక్కడ నెల రోజులపాటు షూటింగ్ జరిపి ఆ తర్వాత జూన్ నెలలో యూరప్ వెళ్ళనుంది చిత్రయూనిట్. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‏తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా. గతంలో వచ్చిన టైగర్ సినిమాకు కబీర్ ఖాన్, టైగర్ 2 చిత్రానికి అలీ అబ్బాస్ దర్శకత్వం వహించారు. అటు సల్మాన్.. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లాల్ సింగ్ చద్ధా సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. ప్రస్తుతం కత్రీనా కైఫ్. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో ఫోన్ బూత్ అనే సినిమాలో నటిస్తుంది.

Also Read:

Liger Movie Update: విజయ్ దేవరకొండ సరసన మరో బాలీవుడ్ బ్యూటీ.. మరింత హింట్ ఇచ్చిన టాలీవుడ్ ముద్దుగుమ్మ…

Jr.NTR Lakshmi Pranathi: సతీమణి పుట్టినరోజు.. విలువైన కానుక ఇచ్చిన యంగ్ టైగర్.. ఎంటో తెలుసా..

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం