Jr.NTR Lakshmi Pranathi: సతీమణి పుట్టినరోజు.. విలువైన కానుక ఇచ్చిన యంగ్ టైగర్.. ఎంటో తెలుసా..

Lakshmi Pranathi BirthDay:  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతికి ఓ విలువైన కానుక ఇచ్చాడట. మార్చి 18న లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా

Jr.NTR Lakshmi Pranathi: సతీమణి పుట్టినరోజు.. విలువైన కానుక ఇచ్చిన యంగ్ టైగర్.. ఎంటో తెలుసా..
Jr.ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2021 | 5:22 PM

Lakshmi Pranathi BirthDay:  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య ప్రణతికి ఓ విలువైన కానుక ఇచ్చాడట. మార్చి 18న లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా తన భార్యకు సిటీలోని ఓ పెద్ద ఫాం హౌజ్‏ను ఆమె పేరు మీద కొన్నాడట యంగ్ టైగర్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు మార్చి 18న ఘనంగా వేడుకలు నిర్వహించారట. ఈ వేడుకలకు కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతోపాటు.. అతి కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. సతీమణి ప్రణతికి ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడట. సిటీలోనే ఓ పెద్ద ఫామ్ హౌజ్‏ను ఆమె పేరు మీద కొనుగోలు చేసి.. తనకు కానుకగా అందించాడట. అంతేకాకుండా… ఆమె పుట్టిన రోజు వేడుకలు కూడా అదే ఫాం హౌజ్‏లో జరిగినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే.. జూనియర్ ఎన్టీఆర్, ప్రణతికి 2011 మే 5న వివాహం జరిగింది. వీరు 2014లో అభయ్ రామ్, 2018లో భార్గవ్ రామ్‏కు జన్మనిచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్‏తోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. వీరికి జోడీగా.. అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు జక్కన్న. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఏప్రిల్‌ నెలలో వారం పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత ఎన్టీఆర్‌ మే, జూన్‌ నెలల్లో సినిమా కోసం పూర్తిగా డేట్స్‌ కేటాయిస్తాడని సమాచారం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు), కళ్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:

National Film Awards 2020: ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’.. ప్రధానంగా ఈ ఐదు కారణాలే…

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!