ఈసారి నామినేషన్స్‌లో ఏకంగా ఎనిమిది మంది.. రచ్చ రచ్చ చేసిన హౌస్‌మేట్స్
బిగ్ బాస్ తెలుగు 10లో ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో హీట్ పెంచేసింది. ఒకవైపు త్రిగుణ్, వర్షిణి మధ్య ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంటే.. మరోవైపు నామినేషన్స్ సందర్భంగా ముకేష్ గౌడ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ వారం ఏకంగా 8మంది నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ సీజన్ 10లో నామినేషన్స్ రచ్చ రచ్చగా సాగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో రామ్ ప్రసాద్‌కు నామినేషన్ అవకాశం వచ్చింది. అతడు శివ, శ్వేతలను ఎంపిక చేశాడు. అయితే ఈ చర్చలోనూ ముకేష్ జోక్యం చేసుకోవడంతో మరోసారి వాగ్వాదం మొదలైంది. ముకేష్ వ్యవహారశైలిపై ఇతర జడ్జీలు అసహనం వ్యక్తం చేశారు. చివరికి జడ్జీలు శ్వేతను సేవ్ చేసి, శివ నామినేషన్‌ను అంగీకరించారు. దీంతో శివకు మరోసారి ఎలిమినేషన్ ముప్పు ఎదురైంది. రెడ్ లెవల్ సభ్యుల నుంచి ఇద్దరికి నామినేషన్ చేసే అవకాశం కల్పించారు. మొదట రోహిత్‌కు ఛాన్స్ ఇవ్వగా, అతడు నరేష్‌ను నామినేట్ చేశాడు. ఇతరులకు పూర్తి స్థాయిలో ప్రయత్నించడం లేదని చెప్పే నరేష్, తన విషయంలోనూ అదే ప్రమాణాన్ని పాటిస్తున్నాడా అనే ప్రశ్నను లేవనెత్తాడు. వర్షిణి 100 శాతం ప్రయత్నించడం లేదని నరేష్ చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదని రోహిత్ చెప్పాడు. దీనిపై నరేష్ పెద్దగా వాదించకుండా, ఆ వ్యాఖ్యలను ప్రశంసలుగానే భావిస్తున్నట్లు స్పందించాడు. మరోవైపు రామకృష్ణ వర్షిణిని నామినేట్ చేశాడు. అతడు చెప్పిన కారణాలతో జడ్జీలు ఏకీభవించడంతో వర్షిణి కూడా నామినేషన్ జాబితాలో చేరింది.
తర్వాత నామినేషన్ అవకాశం ఝాన్సీకి దక్కింది. ఆమె శివను నామినేట్ చేస్తూ గతంలో టాస్క్ సందర్భంగా అతడు తొడకొట్టిన విషయాన్ని ప్రస్తావించింది. దానికి శివ తన వైఖరిని వివరించాడు. ఆ తర్వాత శ్వేతకు అవకాశం రాగా, ఆమె ఝాన్సీని నామినేట్ చేసింది. ఇద్దరి వాదనలను పరిశీలించిన జడ్జీలు శ్వేత చెప్పిన కారణాలతో ఏకీభవించి ఝాన్సీని నామినేషన్‌లోకి పంపించారు. దీంతో ఈ వారం నామినేషన్స్ జాబితా మరింత పెరిగింది. నామినేషన్స్ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న సమయంలో జడ్జీలు ఒకరిని నేరుగా నామినేట్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ విషయంపై జడ్జీలతో చర్చించాల్సిన ముకేష్, రెడ్ టీమ్ సభ్యులతో మాట్లాడటంతో బిగ్ బాస్ అసహనం వ్యక్తం చేశారు.
తాను చెప్పిన విషయం అర్థమైందా అని బిగ్ బాస్ ప్రశ్నించగా, ముకేష్ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో ముందు చెప్పేది వినాలని, అప్పుడు మాత్రమే విషయం అర్థమవుతుందని బిగ్ బాస్ అతడికి క్లాస్ తీసుకున్నారు. ఈ పరిణామం తర్వాత జడ్జీలు చర్చించి వంశీని నేరుగా నామినేట్ చేశారు. ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసే సమయానికి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రమాదంలో నిలిచారు. జడ్జీల నిర్ణయాలు, కంటెస్టెంట్ల మధ్య వాదనలు, ముకేష్ జోక్యంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మొత్తంగా వంశీ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ. వీరిలో ఎవరు తక్కువ ఓట్లు సాధించి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా వర్షిణి, శివ, సుధీర్ వంటి కంటెస్టెంట్ల నామినేషన్‌తో ఈ వారం ఎలిమినేషన్‌పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరి ప్రేక్షకుల ఓట్లు ఎవరిని కాపాడతాయి.? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది. ? అనేది చూడలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




