Vakeel Saab: ‘కుళ్లు రాజకీయాలు మానేయాలి’.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాపై సంచలన కామెంట్ చేసిన హీరోయిన్..

దాదాపు మూడేళ్ళ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరోను వెండితెరపై చూసిన అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. 

Vakeel Saab: కుళ్లు రాజకీయాలు మానేయాలి.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాపై సంచలన కామెంట్ చేసిన హీరోయిన్..
Poonam Kaur

Edited By:

Updated on: Apr 10, 2021 | 12:41 PM

Poonam Kaur: దాదాపు మూడేళ్ళ తరవాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరోను వెండితెరపై చూసిన అభిమానులు ఆనందానికి హద్దులు లేవు. మొదటి షో నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిచిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ ఇది. ఈ మూవీలో పవన్ తన పవర్ ప్యాక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా పై అన్ని వర్గాలనుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా తారలు, సెలబ్రెటీలు సినిమాపై ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పూనమ్ కౌర్ వకీల్ సాబ్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

పూనమ్ కౌర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .. “మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఎవరు చేసినా ఎంకరేజ్ చేయాలి. కానీ ఈ డిఫేమింగ్ ఆర్గనైజ్డ్ ట్రెండ్ ఏంటో? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు కుళ్ళు రాజకీయాలు? అమ్మాయిలను డిఫేమ్ చేసి రాజకీయాలు చేస్తే తప్పు కాదు. అమ్మాయిలను రక్షించే సినిమా తీస్తే ప్రాబ్లెమ్ ఎవరికి..?  ” అంటూ ప్రశ్నించింది పూనమ్. అంతేకాక ”సినిమా  – రాజకీయాల మధ్య సంబంధం అనేది ప్రజలకు ఉపయోగపడాలి. . సినిమా- రాజకీయం కలిసి కాపురం చెయ్యకపోతే ఫీల్ అయ్యేది మాత్రం చూస్తున్న జనాలు. అందుకే  కుళ్లు రాజకీయాలు మానేయాలి” అని ట్వీట్ చేసింది పూనమ్ కౌర్.

మరిన్ని ఇక్కడ చదవండి : కాఫీ వ్యక్తిగా మారిన కాజల్‌ అగర్వాల్‌..! గ్రీన్‌ టీ నుంచి అటువైపు ఎందుకు మళ్లిందో తెలుసా..?

Balakrishna Movie : ఉగాది రోజున BB3 అఫీషియల్‌ టైటిల్‌..? ఇక బాలకృష్ణ ఫ్యాన్స్‌కి పండగే.. చూసుకోండి..!

వకీల్‌‌‌‌సాబ్ వసూల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే…

Follow Us