Tollywood: పాలు కారే బుగ్గలున్న ఈ క్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?
సెలబ్రిటీలు తమ జీవితంలోని ప్రతి సందర్భాన్ని ఫ్యాన్స్‌తో పంచుకోవడం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ షేర్ చేసిన చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ అయ్యారో చూస్తూనే ఉన్నాం. తమ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ మాత్రమే కాదు. ఎక్కడైనా వెకేషన్స్‌కి వెళ్లినప్పుడు, ఏదైనా పండుగ సందర్భంలో లేదా ఈవెంట్ సందర్భంగా దిగిన ఫోటోలను నెటిజన్లు, అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. వాటిని ఫ్యాన్స్ వైరల్ చేస్తారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. అటు శారీ కట్టినా అందంగా ఉంటుంది. ట్రెండీ వేర్‌లో అయితే సెగలు రేపుతోంది.
ఆమె కాళ్లు కూడా చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఆమెను ఫ్యాన్స్ ముద్దుగా మేడమ్ అని కూడా పిలుచుకుంటారు. బన్నీనే మేడమ్ అన్నాడు.. మనమంత చెప్పండి. యస్ మీ గెస్ కరెక్టే తను పూజాహెగ్డే. బుట్టబొమ్మగా తెలుగువారి మనసుల్లో స్థానం సంపాదించుకుంది ఈ బ్యూటీ. చిన్నప్పటికీ, ఇప్పటికీ గుర్తు పట్టుకుండా మారిపోయింది కదూ. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించే పూజా… ఏడుపు సన్నివేశాల్లో మాత్రం తేలిపోతుంది. ఆ విషయంలో ఆమె మీమ్స్ చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు నెటిజన్స్. ఈ మధ్య ఈ బ్యూటీని ప్లాపులు వెంటాడుతున్నాయి.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో ఓ మూవీ చేస్తున్న పూజాహెగ్డే.. టాలీవుడ్‌లో మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తీస్తున్న ఓ సినిమాలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పూజాహెగ్డే కెరీర్ చాలా కీలకం. ఈ సినిమాలు హిట్ అవ్వాలని మనం కూడా పూజాకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం.
View this post on Instagram