Pooja Hegde: సర్జరీ చేయించుకున్న పూజాహెగ్డే.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ టీమ్
మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ చిన్నది.. ఆ తర్వాత వచ్చిన హరీష్ శంకర్ డీజే (దువ్వాడ జగన్నాథం) సినిమాలో ఏకంగా బికినీతో రెచ్చిపోయి కుర్రకారుకు కిర్రెక్కించింది.

టాలీవుడ్ బుట్టబొమ్మ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదుంది. ఒక లైలా కోసం సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన పూజాహెగ్డే.. ఆ తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంది. మొదటి రెండు సినిమాల్లో పద్దతిగా కనిపించిన ఈ చిన్నది.. ఆ తర్వాత వచ్చిన హరీష్ శంకర్ డీజే (దువ్వాడ జగన్నాథం) సినిమాలో ఏకంగా బికినీతో రెచ్చిపోయి కుర్రకారుకు కిర్రెక్కించింది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల ఛాన్స్ దక్కించుకొని టాప్ హీరోయిన్ గా రాణించింది. కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి అలరించింది పూజా. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా ఫస్ట్ ఛాయిస్ గా ఎంచుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం ఈ చిన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటిస్తోంది పూజా. మహేష్ బాబుతో కలిసి పూజ చేస్తోన్న రెండో సినిమా ఇది. గతంలో మహర్షి సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. మహేష్ తల్లి ఇందిరాదేవి కన్నుమూసిన కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే ఈ మధ్య పూజాహెగ్డే సర్జరీ చేయించుకుందని టాక్ వినిపిస్తోంది.
పూజా హెగ్డే కాస్మెటిక్ సర్జరీ చేయించుకుందని ఆ కారణంగానే తను లండన్ వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. నోస్ తో పాటు లిప్స్ కి పూజా హెగ్డే సర్జరీ చేయించుకుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఈ వార్తల పై పూజాహెగ్డే టీమ్ స్పందించింది. ఆగస్టులో వెకేషన్ కి వెళ్లి వచ్చిందని తనకు ఎలాంటి సర్జరీ జరగలేదని అవన్నీ బేస్ లెస్ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు పూజా టీమ్.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




