Daksha Nagarkar: చైతూలాంటివాడిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన దక్షా

ఆ తర్వాత హుషారు అనేసినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఇక కింగ్ నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ.

Daksha Nagarkar: చైతూలాంటివాడిని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.. ఆసక్తికర కామెంట్స్ చేసిన దక్షా
Daksha Nagarkar
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 04, 2023 | 9:03 AM

దక్షా నాగర్కర్.. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హోరాహోరి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది దక్షా. ఆ తర్వాత హుషారు అనేసినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఇక కింగ్ నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఈ భామ. ఆ సినిమా టైం లో నాగ చైతన్య కు సైగలు చేసి హాట్ టాపిక్ గా మారింది ఈ బ్యూటీ. బంగార్రాజు సినిమా సక్సెస్ మీట్ సమయంలో నాగ చైతన్యకు కళ్ళతో సైగల్ చేసింది దక్షా.. దాంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో తెగ వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. దీని పై క్లారిటీ కూడా ఇచ్చారు.

తాజాగా దక్షా రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమాలో చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ భామ. అయితే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో దక్షా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. చైతూ లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుందని తెలిపింది దక్షా.

చైతూ లాంటి సింపుల్ అబ్బాయిని ప్రతి ఒక్క అమ్మాయి కావాలనుకుంటుంది. అతను అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. అలాగే అమ్మాయిలను గౌరవిస్తాడు. బంగార్రాజు మూవీ షూటింగ్ లో నన్ను హగ్ చేసుకోవడానికి.. ముద్దులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అని తెలిపింది దక్షా. షూటింగ్ తర్వాత సారీ చెప్పేవాడని చెప్పుకొచ్చింది.