
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు సుహాస్. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మెప్పించాడు సుహాస్ ఎలాంటి పాత్రలైన అలవోకగా పోషిస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు సుహాస్. ఇక ఫ్యామిలీ డ్రామా, తాజాగా అడివిశేష్ హిట్ 2 సినిమాల్లో సైకో కిల్లర్ పాత్రలు పోషించి మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. కీర్తిసురేష్ తో కలిసి సుహాస్ నటించిన ఉప్పుకప్పురంబు సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు. ఓటీటీలో ఈ సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది.
అలాగే ఓ భామ అయ్యో రామ అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు సుహాస్. ఇక ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు. తమిళ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాలో సుహాస్ విలన్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ బాబు గురించి సుహాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. గతంలో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ ను మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసి టీమ్ కు విషెస్ తెలిపారు.
ట్విట్టర్ వేదికగా రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లింక్‌ను షేర్ చేసిన మహేశ్..మీరు ఎప్పుడూ కొత్తగా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంటూ సినిమా నిర్మాతలు అనురాగ్ రెడ్డి, శరత్ చంద్రలను ట్యాగ్ చేశారు. అలాగే సుహాస్ హీరోయిన్ టీనా శిల్ప రాజ్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు మహేష్. కాగా తన సినిమాపై మహేశ్ ట్వీట్ చేయడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు సుహాస్. ‘అప్పుడు పోకిరి సినిమా టిక్కెట్ల కోసం వెళ్లి విజయవాడ అలంకార్ థియేటర్ లో నా చొక్కా చిరిగిపోయింది. ఇప్పుడు ఈ ట్వీట్ చూసినా చొక్కా నేనే చింపుకునే అంత ఆనందం వచ్చింది. థాంక్యూ సో మచ్ సార్, హ్యాపీయెస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అంటూ మహేశ్‌పై అభిమానం చాటుకున్నాడు సుహాస్. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.