
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుహాస్. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు ఈ టాలెంటెడ్ హీరో.. అంతకు ముందు పలు షార్ట్ ఫిలిమ్స్ లో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తన నటనతో, కామెడీ టైమింగ్ తో తక్కువ సమయంలోనే హీరోగా సక్సెస్ అయ్యాడు. సుహాస్ ఎలాంటి పాత్రలైన అలవోకగా పోషిస్తూ దూసుకుపోతున్నాడు. కేవలం హీరోగానే కాదు. నెగిటివ్ రోల్స్ లోనూ అద్భుతంగా నటిస్తున్నాడు. వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు సుహాస్. ఇక ఇప్పుడు ఓ భామ అయ్యో రామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుహాస్. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
సుహాస్ 2014లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. వచ్చిన మొదటి ఒకటి, రెండు సంవత్సరాలు ఆడిషన్స్‌కే సరిపోయాయని ఆయన తెలిపాడు. 2015 చివరి నాటికి చాయ్ బిస్కెట్ టీమ్ స్టార్ట్ అవ్వడం తన కెరీర్‌కు చాలా సహాయపడిందని, అది లేకపోతే తన ప్రయాణం చాలా తేడాగా ఉండేదని ఆయన అన్నాడు. చాయ్ బిస్కెట్ ద్వారా చాలా మంది దర్శకులు, నటులతో పరిచయం ఏర్పడిందని సుహాస్ పేర్కొన్నాడు. నటుడిగా మంచి రోల్స్ చేయాలని ఇండస్ట్రీకి వచ్చానని, అయితే హీరో అవ్వాలని తాను నిజంగా అనుకోలేదని సుహాస్ అన్నాడు. తాను హీరోగా మారాలని అనుకుంటున్న సమయంలోనే పుష్ప చిత్రంలో కేశవ పాత్రకు దర్శకుడు సుకుమార్ తనను సంప్రదించారని తెలిపాడు.
ఆ సమయంలోనే కలర్ ఫోటో చిత్రం కోసం బిజీగా ఉండటం వలన పుష్పలో నటించే అవకాశం కోల్పోయానని సుహాస్ వివరించారు. పుష్ప సినిమా మిస్ అయ్యింది. అప్పుడు ఫ్రెండ్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాను.. ఇప్పుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీయడం అవసరమా అని కలర్ ఫోటో దర్శకుడు నా స్నేహితుడు సందీప్ తో చెప్పినప్పుడు.. కలర్ ఫోటో సినిమాను నువ్వు హీరోగా కనిపించాలని కాదు, నల్లగా ఉన్నోడే కావాలి అందుకే అడుగుతున్నాను” అని సరదాగా అన్నారని ఆయన గుర్తుచేసుకున్నారు. పెద్ద సినిమా అవకాశం మిస్ అవుతుందని అప్పట్లో బాధపడ్డానని, అయితే ఆ తర్వాత కలర్ ఫోటో కూడా తన కెరీర్‌కు సహాయపడిందని అన్నాడు. సుకుమార్ గారు కచ్చితంగా నువ్వే చేయాలంటే చేసేసేవాడిని అని కూడా సుహాస్ తెలిపాడు. తన కొత్త చిత్రం ఓ బొమ్మ అయ్యో రాము గురించి మాట్లాడుతూ, ఇది ఒక రామ్ కామ్ అని, ఈ జోనర్‌లో మొదటిసారి నటిస్తున్నానని సుహాస్ తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్ర డిఫరెంట్‌గా ఉంటుందని, మొదటి సగం ఎనర్జిటిక్‌గా ఉంటే, రెండవ సగంలో తన పాత్రకు ఒక ట్రామా ఉంటుందని, దాని ఆధారంగా కథ నడుస్తుందని వివరించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..