Sai Dharam Tej: ‘ఫ్యాన్స్.. మీరు అలా చేస్తేనే నా పెళ్లి అవుతుంది’.. మెగా మేనల్లుడి షాకింగ్ కామెంట్స్ వైరల్
తోటి నటీనటులతో ఎంతో కలివిడిగా ఉండే మెగా మేనల్లుడు ఇతరుల సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు హాజరవుతుంటాడు. చిన్న హీరో, పెద్ద హీరో.. అనే తేడా లేకుండా ఎవరు ఆహ్వానించినా వచ్చి సపోర్ట్ చేస్తుంటాడు
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మళ్లీ సినిమాలతో బిజీగా అవుతున్నాడు. యాక్సిడెంట్ తర్వాత చాలా రోజులు విరామం తీసుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం విరూపాక్ష అనే సినిమా షూటింగ్లో తలమునకలై ఉన్నాడు. కాగా తోటి నటీనటులతో ఎంతో కలివిడిగా ఉండే మెగా మేనల్లుడు ఇతరుల సినిమా ఫంక్షన్లు, ఈవెంట్లకు హాజరవుతుంటాడు. చిన్న హీరో, పెద్ద హీరో.. అనే తేడా లేకుండా ఎవరు ఆహ్వానించినా వచ్చి సపోర్ట్ చేస్తుంటాడు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయిధరమ్ తేజ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ క్రమంలో చిత్ర బృందానికి విషెస్ చెబుతూనే.. తన పెళ్లి గురించి అడిగిన ఫ్యాన్స్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ‘వినరో భాగ్యము విష్ణుకథ ట్రైలర్ చాలా బాగుంది. ఇదివరకే కిరణ్ నన్ను చాలా సినిమా ఫంక్షన్లకు పిలిచాడు. కానీ రాలేకపోయాను. ట్రైలర్ కొత్తగా ఉంది. కాకపోతే నాకే అదృష్టం కలిసి రాలేదు. నాకు అంత కాంట్రవర్సీలు లేవు. చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్’ అని తెలిపాడు తేజ్.
కాగా సుప్రీం హీరో మాట్లాడుతున్న సమయంలోనే ఫ్యాన్స్.. ‘అన్నా పెళ్లి ఎప్పుడు’? అని గోల చేశారు. వెంటనే రియాక్ట్ అయిన తేజ్.. ‘చెప్తా.. మీరెప్పుడైతే అమ్మాయిలను గౌరవిస్తారో.. అప్పుడే నా పెళ్లి అవుద్ది.. ‘పెళ్లి ఎవ్వడు రా.. ముందు మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. నాలుగు సార్లు అయ్యింది పెళ్లి’ అని చెప్పుకొచ్చాడు తేజ్. దీంతో ఈవెంట్ వేదికపై ఉన్న సినీతారలు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే తేజ్ సరదాకే ఈ మాటలు అన్నాడు. కాగా తేజ్ నటిస్తోన్న విరూపాక్ష సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందిస్తుండగా.. కిరణ్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..