డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ మిస్ యూనివర్స్ 2024గా ఎంపికైంది. 21 ఏళ్లకే ప్రపంచ అందాల దేవతగా నిలిచి.. విశ్వసుందరి కిరీటాన్ని అందుకుంది
TV9 Telugu
మెక్సికో వేదికగా జరిగిన ఈ పోటీల్లో 125 మంది పోటీ పడగా విక్టోరియా కెజార్ విజయాన్ని సొంతం చేసుకుంది. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా, మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్ మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు
TV9 Telugu
2023 మిస్ యూనివర్స్ షెన్నిస్ పలాసియోస్ విజేతకు కిరీటాన్ని అందజేశారు. విక్టోరియా కెజార్ హెల్విగ్ 73వ విశ్వ సుందరిగా గెలుపొందినందుకు ఆమెకు అభినందనలు తెలిపారు
TV9 Telugu
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో స్ఫూర్తి నింపేలా మీ ప్రయాణం సాగాలని కోరుకుంటున్నామని మిస్ యూనివర్స్ టీమ్ పేర్కొంది. ఆమెకు ఫ్యాషన్ ప్రియులు సైతం అభినందనలు తెలిపారు. ఇక ఈ పోటీల్లో భారత్ తరఫున రియా సింఘా పాల్గొన్నగా.. టాప్ 5లోనూ ఆమె నిలవలేకపోయారు
TV9 Telugu
విశ్వ సుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామ విక్టోరియానే కావడం విశేషం. 2004లో సోబోర్గ్‌లో జన్మించిన ఆమె బిజినెస్ అండ్ మార్కెటింగ్‌లో డిగ్రీ పొందారు. వ్యాపారవేత్తగా మారారు
TV9 Telugu
అందాల పోటీల్లోకి అడుగుపెట్టాలనే ఉద్దేశంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టి మిస్ డెన్మార్క్‌గా తొలిసారి విజయాన్ని అందుకున్నారు. 2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో టాప్ 20లో నిలిచి.. అందరి దృష్టి ఆకర్షించారు
TV9 Telugu
విక్టోరియా అందంలోనేకాదు తెలివి తేటల్లోనూ మేటి. అందాల పోటీ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానం చెప్పి న్యాయనిర్ణేతలు ముగ్ధులను చేశారు
TV9 Telugu
విక్టోరియా అందాల రాణి మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం, మూగ జీవాల సంరక్షణ వంటి విషయాలపై ఆమె విశేష సేవ చేస్తున్నారు. ఆమె వృత్తిరీత్యా వ్యాపారవేత్త.. ప్రొఫెషనల్ డాన్సర్ కూడా