సింగర్​గా మారిన‌ నాని భార్య..రెస్పాన్స్ అదుర్స్..

విభిన్న క‌థ‌లు ఎంచుకోవ‌డం, న‌టించిన ప్ర‌తి పాత్ర‌లో జీవించ‌డం. ఇది న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ప్ర‌యాణం సాగిస్తోన్న తీరు. అందుకే ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు ఇట్టే క‌నెక్ట్ అయిపోతారు. నాని ఏ రోల్ చేసినా ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారు.

  • Ram Naramaneni
  • Publish Date - 4:49 pm, Wed, 1 July 20
సింగర్​గా మారిన‌ నాని భార్య..రెస్పాన్స్ అదుర్స్..

విభిన్న క‌థ‌లు ఎంచుకోవ‌డం, న‌టించిన ప్ర‌తి పాత్ర‌లో జీవించ‌డం. ఇది న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం ప్ర‌యాణం సాగిస్తోన్న తీరు. అందుకే ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు ఇట్టే క‌నెక్ట్ అయిపోతారు. నాని ఏ రోల్ చేసినా ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారు. ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్స్ లేక‌పోవ‌డంతో కుటుంబంతో విలువైన స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు నాని. ఇక నాని వైఫ్ అంజనా కూడా నానిలాగే చాలా సింపుల్‌గా ఉంటారు.

అయితే తాజాగా ఆమె గాయనిగా మారారు. ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే’..సాంగ్ ను తన ఫ్రెండ్ తో కలిసి హమ్‌ చేస్తూ అలరించారు. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైరల్​గా మారింది. నెటిజన్లను ఆమె వాయిస్ చాలా బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.