Nani : దాని వల్ల రెండు నెలల సరిగా నిద్రపోలేదు.. నాని ఆసక్తికర కామెంట్స్
అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ నేచురల్ స్టార్. అలా మొదలైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాని.

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన హీరోగా ఎదిగాడు నాని. అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఈ నేచురల్ స్టార్. అలా మొదలైంది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హా ఎదిగాడు ఈ కుర్ర హీరో. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాని. త్వలోనే దసరా అనే సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. నాని మునుపెన్నడూ కనిపించని మాస్ పాత్రలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశాడు. దసరా మూవీ షూటింగ్ లో చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు నాని. దాని వల్ల రెండు నెలల సరిగా నిద్రపోలేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘డంపర్ ట్రక్ బోగ్గును తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. ఆ సీన్‌లో నేను ఆ డంపర్ ట్రక్‌లో నుంచి కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. దీని కోసం సింథటిక్ బొగ్గు చేశారు. అది మొత్తం దుమ్ముతో ఉంటుంది’ అన్నాడు. అలాగే ‘ఆ సీన్‌లో నేను ఆ డంపర్‌లో నుంచి క్రింద పడిపోయాను.
సింథటిక్ బొగ్గు కింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సాయం చేశారు. ఆ గ్యాప్‌లో నేను గాలి పీల్చకుండా ఉండాలి. పీల్చితే ఆ దుమ్మంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు డంప్‌లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి.. దాదాపు రెండు నెలలు నిద్రపట్టలేదు.