Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game On : “గేమ్ ఆన్‌’’ కాంటెస్ట్ లో పాల్గొనండి లక్ష రూపాయలు గెలుపొందండి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన చిత్రయూనిట్

మా ‘గేమ్ ఆన్’ చిత్రం నుండి మేము రీసెంట్ గా మొదటి సారి హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా విడుదల చేసిన రిచో రిచ్ సాంగ్ కు 3 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉంది.

Game On : “గేమ్ ఆన్‌’’  కాంటెస్ట్ లో పాల్గొనండి లక్ష రూపాయలు గెలుపొందండి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన చిత్రయూనిట్
Game On
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 16, 2023 | 7:49 PM

గీత్ ఆనంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లిరికర్ “రిచో రిచ్”పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే ఈ పాట 3 మిలియన్స్ తో వ్యూస్ తో దూసుకుపోతున్న సందర్బంగా చిత్ర బృందం ఒక కాంటెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ లో రీల్స్ చేసి విజయం సాధించిన వారిని సెలెక్ట్ చేసి ఒక్కక్కరికి 25 వేల చొప్పున లక్ష రూపాయల ప్రైజ్ మనీని ఇస్తామని అనౌన్స్ చేసింది చిత్ర బృందం.

ఈ సందర్బంగా నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ.. మా ‘గేమ్ ఆన్’ చిత్రం నుండి మేము రీసెంట్ గా మొదటి సారి హైదరాబాద్ ఫేమస్ నవాబ్ గ్యాంగ్ బ్యాండ్ ద్వారా విడుదల చేసిన రిచో రిచ్ సాంగ్ కు 3 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు తెలుపుతూ వారందరినీ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో వారు మాకిచ్చిన గిఫ్ట్ ను తిరిగి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మేము ఒక కాంటెస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్ లో పాల్గొని బెస్ట్ రీల్స్ చేసిన నలుగురిని సెలెక్ట్ చేసి ఒక్కొక్కరికి 25,000 చొప్పున లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది.అందరూ పాల్గొని మా ప్రైజ్ మనీని గెలుచు కోవాలని కోరుకుంటున్నాము. ఈ చిత్రం నుండి మేము విడుదల చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ చూసి చాలా మంది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి ఏప్రిసియేట్ చేస్తున్నారు. దాంతో మా సినిమాపై మాకు చాలా మంచి నమ్మకం వచ్చింది.అందరూ ఎంతో కష్టపడి, కలసి టీం వర్క్ చేశారు. అర‌వింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువ‌ల్స్ ఇచ్చాడు. ప్ర‌తి ఫ్రేమ్ మిమ్మ‌ల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. ఇన్‌టెన్స్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ఇది. హీరో ఒక లూజ‌ర్ గా తన లైఫ్ లో మిగిలి పోతున్న టైమ్‌లో త‌న లైఫ్‌లో ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. త‌న‌ని ఆ గేమ్ ఏ లెవ‌ల్‌కు తీసుకెళుతుంద‌ నేదే ఈ క‌థ‌. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ త‌ప్ప‌కుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ప్రతీ ఒక్కరూ చ‌క్క‌గా స‌పోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను మీరందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్ట‌ర్ ద‌యానంద్ మాట్లాడుతూ.. మేము విడుదల చేసిన రిచో రిచ్ సాంగ్ కు 3 మిలియన్స్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉంది.వారికే తిరిగి ఇవ్వాలని మేము తలపెట్టిన కాంటెస్ట్ లో పాల్గొని లక్ష రూపాలు బహుమానం పొందాలని కోరుతున్నాను. గేమ్ ఆన్ విషయానికి వస్తే ‘ఇది రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండే కథ. తెలుగులో ఇప్పుడు డిఫ‌రెంట్ సినిమాలు రావడమే కాదు.. స‌క్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవ‌లోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నాను. చాలా ట్విస్టులు, ట‌ర్న్స్ ఉన్న మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. ఈ సినిమాలో యాక్ష‌న్‌, రొమాన్స్. ఎమోష‌న్స్..తో పాటు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్ తో త్వరలో వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.

బెంగళూరులో దారుణం.. ఇద్దరు యువతులను వెంబడించిన వ్యక్తి..
బెంగళూరులో దారుణం.. ఇద్దరు యువతులను వెంబడించిన వ్యక్తి..
వాషింగ్టన్ అవుట్ పైవివాదం
వాషింగ్టన్ అవుట్ పైవివాదం
అదితి రావు హైదరీ సంచలన కామెంట్స్..
అదితి రావు హైదరీ సంచలన కామెంట్స్..
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో అవకాడో తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
చాన్నాళ్ళకు ఫ్యాన్స్ ముందుకు తారక్.. ఏమి మాట్లాడారంటే.?
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
స్టాక్ మార్కెట్లో గందరగోళం.. 5 నిమిషాల్లోనే 19 లక్షల కోట్లు అవిరి
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
నా కొడుకు ఏ తప్పు చేయలేదు.. ఐటీ దర్యాప్తుపై పృథ్వీరాజ్ తల్లి కామె
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
వైట్‌ రైస్‌కి బదులుగా ఓట్స్‌ తింటున్నారా..? ఏమౌతుందో తెలుసుకోవడం
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
అమెరికాలో లక్షల్లో జీతం.. పవన్ కళ్యా్ణ్ సినిమాలో ఛాన్స్ రావడంతో..
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం
తక్కువ పెట్టుబడి..ఇంటి నుండే పొటాటో చిప్స్ తయారీ.. రెట్టింపు లాభం