Hero Nani: మంచి మనసు చాటుకున్న న్యాచురల్‌ స్టార్‌.. వీధి కుక్క పిల్లను దత్తత తీసుకున్న నాని

|

Sep 05, 2022 | 8:09 AM

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువ డబ్బులు వెచ్చించి బ్రీడ్‌డాగ్స్‌ను కొనుగోలు చేస్తారు. వాటినే అపురూపంగా పెంచుకుంటారు. అయితే యాక్టింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) మాత్రం ఒక వీధి కుక్కపిల్లను దత్తత తీసుకున్నాడు.

Hero Nani: మంచి మనసు చాటుకున్న న్యాచురల్‌ స్టార్‌.. వీధి కుక్క పిల్లను దత్తత తీసుకున్న నాని
Hero Nani
Follow us on

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువ డబ్బులు వెచ్చించి బ్రీడ్‌డాగ్స్‌ను కొనుగోలు చేస్తారు. వాటినే అపురూపంగా పెంచుకుంటారు. అయితే యాక్టింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న న్యాచురల్‌ స్టార్‌ నాని (Nani) మాత్రం ఒక వీధి కుక్కపిల్లను దత్తత తీసుకున్నాడు. దీనికి చిట్టి అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నాడు. నాని కుక్క పిల్లను దత్తత తీసుకోవడానికి కారణం అల్లరి నరేష్ భార్య విరూప అని తెలుస్తోంది. ఆమె ద్వారానే నాని కుటుంబం కుక్కపిల్లని దత్తత తీసుకున్నారట. ఈ మేరకు ఆ కుక్కపిల్లను దత్తత తీసుకునేందుకు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన ఒక యానిమల్ యాక్టివిస్ట్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈనేపథ్యంలో నానితో పాటు అతని తండ్రి రాంబాబు కుక్కపిల్లతో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ విషయం తెలుసుకున్న నాని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ అభిమాన హీరో సింప్లిసిటీని చూసి మెచ్చుకుంటున్నారు. వేల రూపాయలు ఖర్చుపెట్టి బ్రీడ్‌డాగ్స్‌ను కొనే బదులు ఇలా రోడ్ల పక్కన తిరిగే వీధి కుక్క పిల్లలను దత్త తీసుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. చివరిగా అంటే సుందరానికి సినిమాలో కనిపించాడు నాని. ప్రస్తుతం దసరా అనే సినిమాలో నటిస్తున్నాడు. కీర్తిసురేశ్‌ న్యాచురల్‌ స్టార్‌ పక్కన ఆడిపాడనుంది. సుమద్రఖని, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, సాయికుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సింగరేణి నేపథ్యంలో కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..