Nagashaurya: డిఫ్రెంట్‌గా దూసుకుపోతున్న నాగశౌర్య.. ఒంగోలులో కృష్ణ వ్రింద విహారి పాదయాత్రకు విశేష స్పందన..

సినిమా ప్రమోషన్ కోసం సినీ హీరోలు కూడా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హీరోహీరో నాగశౌర్య(Naga shaurya) తన తాజా సినిమా ప్రమోషన్ కోసం యిన్ తో కలిసి ఒంగోలులో పాదయాత్ర చేశారు. 

Nagashaurya: డిఫ్రెంట్‌గా దూసుకుపోతున్న నాగశౌర్య.. ఒంగోలులో కృష్ణ వ్రింద విహారి పాదయాత్రకు విశేష స్పందన..
Nagashaurya
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 16, 2022 | 7:47 AM

ప్రస్తుతం పాదయాత్ర సీజన్ నడుస్తుంది.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తుంటే తమ సినిమా ప్రమోషన్ కోసం సినీ హీరోలు కూడా పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హీరోహీరో నాగశౌర్య(Naga shaurya) తన తాజా సినిమా ప్రమోషన్ కోసం యిన్ తో కలిసి ఒంగోలులో పాదయాత్ర చేశారు.  నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఈ చిత్రంతో న్యూజిలాండ్ సింగ‌ర్‌, బాలీవుడ్ న‌టి షిర్లే సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

తాజాగా చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 14న తిరుపతి, నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఈరోజు నెల్లూరు, ఒంగోలులో పూర్తి చేసుకుంది.. ఈ సందర్భంగా ఒంగోలు వీధుల్లో హీరో నాగశౌర్య హీరోయిన్ షిర్లీ సెటియా చేసిన పాదయాత్రకు మంచి స్పందన లభించింది.

పలువురు యువకులు నాగశౌర్యతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.. లాక్ డౌన్ దగ్గర నుంచి జనానికి దూరంగా షూటింగ్ స్పాట్ లోనే ఉంటున్న తమకు ప్రజల మధ్యకు వచ్చి వారు ఏం కోరుకుంటున్నారో తెలిసుకునేందుకు ఈ పాదయాత్ర దోహద పడిందని హీరో నాగశౌర్య తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు ప్రజలు అందించిన ప్రేమను ఎప్పటికీ మరువలేనని అన్నారు.

ఇవాళ్టి నుంచి 16న విజయవాడ, గుంటూరు, ఏలూరు.. 17న భీమవరం, రాజమండ్రి.. 18న కాకినాడ, వైజాగ్‌లో ‘కృష్ణ వ్రింద విహారి’ చిత్ర యూనిట్ పాదయాత్ర చేయనుంది. ఈ పాదయాత్రలో హీరో నాగశౌర్య స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు. తెలుగు సినీ చరిత్రలో ఇలా పాదయాత్ర చేయడం ఇదే మొదటిసారి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం