Manchu Vishnu: పెళ్లిరోజున ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కూతుళ్లు.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు.. వీడియో వైరల్‌

|

Mar 02, 2023 | 4:39 PM

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు- విరానికల వైవాహిక బంధానికి బుధవారం (మార్చి1)తో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారీ లవ్లీకపుల్‌.

Manchu Vishnu: పెళ్లిరోజున ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కూతుళ్లు.. కన్నీళ్లు పెట్టుకున్న మంచు విష్ణు.. వీడియో వైరల్‌
Manchu Vishnu
Follow us on

టాలీవుడ్‌ హీరో మంచు విష్ణు- విరానికల వైవాహిక బంధానికి బుధవారం (మార్చి1)తో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తమ పెళ్లి రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారీ లవ్లీకపుల్‌. సోషల్‌ మీడియా వేదికగా ఒకరికిఒకరు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కూడా విష్ణు- విరానిక దంపతులకు విషెస్‌ తెలిపారు. ఇదే సందర్భంగా విష్ణు- విరానికలకు మర్చిపోలేని బహుమతినిచ్చారు వారి కూతుళ్లు అరియానా, వివియానా. తమ కూతుళ్లు ఇచ్చిన సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌కు విష్ణు ఎమోషనల్‌ అయ్యాడు. ఇంతకీ అరియానా, వివియానా ఏం బహుమతినిచ్చారో తెలుసా? తమ పేరెంట్స్‌ పెళ్లి రోజు సందర్భంగా వీరు ఓ అద్భుతమైన పాటను ఆలపించారు. అంతేకాదు తమ తల్లిదండ్రుల వివాహబంధం మొదలైన క్రమాన్ని ఫొటోల సహాయంతో కళ్లకు కట్టినట్లు చూపించారు. వీటన్నింటినీ ఒక స్పెషల్‌ వీడియోగా చిత్రీకరించి తమ పేరెంట్స్‌కు బహుమతిగా నిచ్చారు. కుమార్తెలు ఇచ్చిన ఈ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ చూసి విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి కూడా పెట్టుకున్నారంట.

ఈ సందర్భంగా విష్ణు తన ట్విట్టర్‌లో కుమార్తెలు కంపోజ్‌ చేసిన వీడియోని పోస్ట్‌ చేశాడు.. ‘ఈ సాంగ్‌ కంప్లీట్ అయ్యే సరికి నా కళ్లలో నీళ్లు తిరిగాయి. థ్యాంక్యూ డార్లింగ్స్. మీరు ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ను నేను జీవితాంతం గుర్తు పెట్టకుంటాను.. ఎన్నటికి మర్చిపోను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అరియానా, వివియానా ట్యాలెంట్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. కాగా ఈ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు ఇప్పటికే తమ ప్రతిభను నిరూపించుకున్న సంగతి తెలిసందే. మంచు విష్ణు జిన్నా సినిమాలో ఫ్రెండ్‌ షిప్‌ పాట వీరి గొంతు నుంచి జాలువారిందే.

ఇవి కూడా చదవండి


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..