Manchu Manoj: ‘నువ్వు నా కోసమే పుట్టావ్‌’.. భార్య మౌనికపై ప్రేమ కురిపించిన మంచు మనోజ్‌.. వెడ్డింగ్‌ వీడియో వైరల్

తాజాగా మనోజ్‌ కూడా మరో పోస్ట్‌ పెట్టాడు. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో తన వివాహ వేడుకలకు సంబంధించిన పలు మధుర జ్ఞాపకాలున్నాయి. మనోజ్‌ కుటుంబ సభ్యులు, అలాగే మౌనిక కుటుంబ సభ్యులు, వైఎస్‌ విజయమ్మ, ఇలాగే ఇరువురి సన్నిహితులు, స్నేహితులను ఈ వీడియోలో చూడవచ్చు.

Manchu Manoj: 'నువ్వు నా కోసమే పుట్టావ్‌'.. భార్య మౌనికపై ప్రేమ కురిపించిన మంచు మనోజ్‌.. వెడ్డింగ్‌ వీడియో వైరల్
Manchu Manoj, Mounika
Follow us
Basha Shek

|

Updated on: Apr 18, 2023 | 10:38 AM

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ రెండో పెళ్లితో తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా మౌనికతో కలిసి ఏడడుగులు వేశాడు మనోజ్‌. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో మనోజ్‌- మౌనికల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లి తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు మనోజ్‌. అలాగే ఇటీవల ఓ టీవీ షోకు హాజరై తన ప్రేమ, పెళ్లినాటి ముచ్చట్లు పంచుకున్నారీ లవ్లీ కపుల్. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ ఇచ్చిన పార్టీలోనూ సందడి చేశారు మౌనిక- మనోజ్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటున్నారీ బ్యూటిఫుల్‌ కపుల్. పెళ్లి తర్వాత మంచు మనోజ్‌తో దిగిన మొదటి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది మౌనిక. తాజాగా మనోజ్‌ కూడా ఒక పోస్ట్‌ పెట్టాడు. తన పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అందులో తన వివాహ వేడుకలకు సంబంధించిన పలు మధుర జ్ఞాపకాలున్నాయి. మనోజ్‌ కుటుంబ సభ్యులు, అలాగే మౌనిక కుటుంబ సభ్యులు, వైఎస్‌ విజయమ్మ, ఇలాగే ఇరువురి సన్నిహితులు, స్నేహితులను ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మనోజ్‌..

‘ఇలాంటి ప్రేమ జీవితంలో ఎవరికైనా ఒక్కసారే దక్కుతుంది. నువ్వు నా కోసమే ఈ భూమ్మీదకు వచ్చావని నాకు తెలుసు. నేను ఇప్పటికీ, ఎప్పటికీ నీ వాడినే. నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో నాకు తెలిసేలా చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ తన సతీమణిపై ప్రేమకు అక్షర రూపమిచ్చాడు మనోజ్‌. ప్రస్తుతం మనోజ్‌- మౌనికల పెళ్లి వీడియో, అలాగే ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మనోజ్‌- మౌనికల జోడీ అద్భుతంగా ఉందంటూ, చూడముచ్చటైన జంట, మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌, లవ్లీ కపుల్‌ అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మనోజ్‌- మౌనికల పెళ్లి సాంగ్‌కు కోలీవుడ్‌ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అచు రాజమణి స్వరాలూ అందించారు. అలాగే అనంత శ్రీరామ్ లిరిక్స్ ని సమకూర్చాడు.

ఇవి కూడా చదవండి

View this post on Instagram

A post shared by Manoj Manchu (@manojkmanchu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే