Mahesh Babu: హైటెక్ సిటీలో సందడి చేసిన సూపర్ స్టార్.. షూటింగ్ కోసం కాదు.. ఎందుకంటే

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుటాడు. మహేష్ బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ షూటింగ్స్ కు.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ కు తప్ప పెద్దగా కనిపించడు.

Mahesh Babu: హైటెక్ సిటీలో సందడి చేసిన సూపర్ స్టార్.. షూటింగ్ కోసం కాదు.. ఎందుకంటే
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 09, 2023 | 12:41 PM

సినిమా తారలు బయట కనిపించడం చాలా అరుదు. హీరోలు బయట కనిపిస్తే చాలు ఫ్యాన్స్ ఎగబడిపోతారు. అందుకే మన హీరోలు ఎక్కువగా విదేశాలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ సమయంలో గ్యాప్ దొరికినప్పుడు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తుటాడు. మహేష్ బయట కనిపించడం చాలా అరుదు. మహేష్ షూటింగ్స్ కు.. ప్రీరిలీజ్ ఈవెంట్స్ కు తప్ప పెద్దగా కనిపించడు. అలాంటి మహేష్ తాజాగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో కనిపించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు మహేష్ హైటెక్ సిటీలో ఏం చేస్తున్నారు అని అనుకుంటున్నారా.? షూటింగ్ కోసం మాత్రం కాదు.

మహేష్ తాజాగా ఆధార్ కార్డు కి సంబంధించిన వెరిఫికేషన్ కోసం ఆయన హైటెక్ సిటీలో ఉన్న ఆఫీస్ కు వచ్చారు. హైటెక్ సిటీ లో దుర్గం చెరువు వద్ద ఉన్న ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఆఫీస్ లో హాజరయ్యారు మహేష్. ఇక మహేష్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ఈ ఫొటోస్, వీడియోస్ లో మహేష్ లుక్ అదిరిపోయింది. క్యాజువల్ షర్ట్ లో .. లాంగ్ హెయిర్ తో కనిపించాడు మహేష్. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దాదాపు 12 ఏళ్ల తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.