Kalyan Ram: కల్యాణ్‌రామ్‌ చేతిపై పచ్చబొట్టు.. ఎవరి పేరో తెలుసా? ఈ టాటూ వెనక ఓ ఆసక్తికర విషయం కూడా ఉందండోయ్‌!!

ఎప్పుడూ పర్సనల్‌ విషయాలను పెద్దగా షేర్‌ చేసుకోని కల్యాణ్‌ రామ్‌ తాజాగా తన సతీమణి స్వాతి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకోవడానికి గల కారణాన్ని రివీల్‌ చేశారు

Kalyan Ram: కల్యాణ్‌రామ్‌ చేతిపై పచ్చబొట్టు.. ఎవరి పేరో తెలుసా? ఈ టాటూ వెనక ఓ ఆసక్తికర విషయం కూడా ఉందండోయ్‌!!
Kalyan Ram

Updated on: Feb 08, 2023 | 11:02 AM

బింబిసార సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చారు నందమూరి కల్యాణ్‌రామ్‌. అందులో డబుల్‌ రోల్‌తో ఆకట్టుకున్న నందమూరి హీరో ఇప్పుడుఅమిగోస్‌లో ఏకంగా త్రిపుల్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న అమిగోస్‌ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ప్రస్తుతం తన సినిమా షూటింగ్‌ ప్రమోషనల్లో తలమునకలై ఉన్నారు కల్యాణ్‌రామ్‌. ఈ సందర్భంగా అమిగోస్‌ సినిమాతో పాటు తన వృక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా షేర్‌ చేసుకుంటున్నారు. కాగా ఎప్పుడూ పర్సనల్‌ విషయాలను పెద్దగా షేర్‌ చేసుకోని కల్యాణ్‌ రామ్‌ తాజాగా తన సతీమణి స్వాతి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన పేరును చేతిపై పచ్చబొట్టుగా వేయించుకోవడానికి గల కారణాన్ని రివీల్‌ చేశారు. ‘2007-08 మధ్య కాలంలో నేను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాను. ఆరోగ్యం బాగా చెడిపోయింది. సాధారణంగా ఈ సమయంలో భర్త పట్ల ఎక్కువ కేర్‌ తీసుకుంటారు. కొందరు నర్సులను పెట్టి చూసుకోమని చెబుతారు. కానీ, నా విషయంలో నర్సులను కూడా వద్దంది నా భార్య. అన్నీ తానే దగ్గరుండి చూసుకుంది. స్వాతికి నా గురించి అంతా తెలుసు. ఒక అమ్మ తన బిడ్డను ఎలా చూసుకుంటుందో.. తను నన్ను అలా చూసుకుంటుంది’

నా భార్య లేకపోతే నేను లేను..

తన కేరింగ్‌తో నన్ను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దింది నా భార్య. అది నా మనసుకు బాగా తాకింది. మా పదవ పెళ్లి రోజున ‘నీకేం కావాలి.. ఏదైనా ఇస్తాను’ అని అడిగాను. కానీ తను మాత్రం ‘నాకేం వద్దు.. నాకు అన్నీ ఉన్నాయి.. పక్కన మీరూ, పిల్లలు ఉన్నారు. అంతకుమించి ఇంకేం కావాలి’ అని చెప్పింది. నా భార్యపై ఉన్న ప్రేమతోనే తన పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నాను. అసలు నాకు సూది మందు అంటేనే చాలా భయం. ఇంజెక్షన్‌ చేయించుకోవాలన్న భయపడిపోయేవాడిని. కానీ ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ఇష్టం అధిగమించేలా చేసింది. అలా ఆమె పేరు నా చేతి మీదకొచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే నా భార్య లేకపోతే నేను లేను’ అని సతీమణిపై ప్రేమను కురిపించారు కల్యాణ్‌ రామ్‌. ప్రస్తుతం నందమూరి హీరో వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Kalyan Ram Family

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..