
బెల్లం కొండ శ్రీనివాస్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్న కూడా సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. విభిన్న కథలు చేస్తున్నప్పటికీ బెల్లం కొండ శ్రీనివాస్ కు హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఆ మధ్య బాలీవుడ్ లోనూ ట్రై చేశాడు. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఛత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దాంతో తిరిగి తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో బెల్లం కొండ శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా థియేటర్స్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది.. అలాగే ఓటీటీలోనూ మంచి రీచ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కిష్కింధపురి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
ఇక ఈ ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సాహు గారపాటి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 12న విడుదలకానుంది. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ దెయ్యం గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ట్రైలర్ లో సినిమా పై అంచనాలు నెలకొన్నాయి. అలాగే బెల్లం కొండ శ్రీనివాస్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.