AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suhasini: సుహాసిని-మణిరత్నం కుమారుడిని చూశారా? హీరోకు ఏ మాత్రం తగ్గని కటౌట్.. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా?

సుహాసిని-మణిరత్నం దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి కుమారుడు నందన్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అతను ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? అన్నది ఎవరికీ తెలియదు. బయట కూడా పెద్దగా కనిపించడు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడు.

Suhasini: సుహాసిని-మణిరత్నం కుమారుడిని చూశారా? హీరోకు ఏ మాత్రం తగ్గని కటౌట్.. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా?
Suhasini Maniratnam
Basha Shek
|

Updated on: May 10, 2026 | 12:06 PM

Share

సుహాసిని- మణిరత్నంలది ప్రేమ వివాహం. వీరి వివాహం 1988లో జరిగింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది సుహాసిని. అలాగే మణిరత్నం కూడా పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు. అయితే ఈ దంపతులకు నందన్ అనే ఒక కుమారుడు ఉన్నాడన్న సంగతి చాలా మందికి తెలియదు. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నా నందన్ మాత్రం ఏ సినిమా ఫంక్షన్, ఈవెంట్ లో కనిపించడు. బయట కూడా పెద్దగా కనిపించడు. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన సుహాసిని తన కుమారుడి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నందన్ లండన్‌లోని ఆక్స్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. మనో శాస్త్రం, రాజకీయం శాస్త్రానికి సంబంధించిన విద్యను అభ్యసించాడు. దీంతో అతనికి రాజకీయాల పట్ల చాలా ఆసక్తి ఉంది. నందన్‌ కమ్యూనిస్టు భావాజాలం ఉన్న వ్యక్తి. 12 ఏళ్ల వయసులోనే కార్ల్‌ మార్క్స్‌ రాసిన మూలధనం పుస్తకాన్ని చదివాడు. 15 వయసులోనే లెనినిజంతో కూడిన కంటోర్స్‌ ఆఫ్‌ లెనినిజం అనే చిన్న కథను కూడా రాశాడు.

ఇతర పిల్లల మాదిరిగా కాకుండా నందన్‌ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్లో జరిగే చర్చలను ఆసక్తిగా వినేవాడు. అలా ఒక పుస్తకాన్ని తీసుకొని కేరళలోని సీపీఎం కార్యాలయానికి వెళ్లాడు నందన్. అయితే అక్కడ తాను కారులో వచ్చినట్లు ఎవరికీ తెలియకూడదని, కారునే వేరే ప్లేస్ లో పార్క్ చేసి పార్టీ ఆఫీసులోనికి వెళ్లాడు. అక్కడ నందన్‌ చూసినవారు ఎవరు నువ్వు ? అని అడక్కుండా భోంచేసావా అని అడిగారు. ఇక తన పేరు అడిగినప్పుడు దర్శకుడు మణిరత్నం పేరు వాడితే తానెవరో తెలిసిపోతుంది అని ఆయన అసలు పేరు గోపాల్‌ రత్నం సుబ్రహ్మణ్యం కొడుకు అని చెప్పాడు. ఆ సంఘటన తర్వాత నందన్‌ సీపీఎం పార్టీ సభ్యుడిగా మారిపోయాడు’ అని నటి సుహాసిని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ అందాల తార కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Suhasini Son Nandan

Suhasini Son Nandan Manirathnam

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నటిగా బిజీ బిజీగా ఉంటున్నారు సుహాసిని. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తున్నారీ అందాల తార.  మణిరత్నం విషయానికి వస్తే.. హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల