Hanuman: అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ.. అక్కడ సగం ధరకే ‘హనుమాన్’ మూవీ టికెట్లు.. పూర్తి వివరాలివే
500 ఏళ్ల రామ భక్తుల కల సాకారమైంది. అయోధ్యలో రాముడు కొలువు దీరాడు. సోమవారం శుభ ముహూర్తంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో దేశమంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని హనుమాన్ చిత్ర బృందం ఒక బంపరాఫర్‌ను ప్రకటించింది.
500 ఏళ్ల రామ భక్తుల కల సాకారమైంది. అయోధ్యలో రాముడు కొలువు దీరాడు. సోమవారం శుభ ముహూర్తంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠాపన వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో దేశమంతా భక్తి పారవశ్యంలో మునిగి తేలుతోంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని హనుమాన్ చిత్ర బృందం ఒక బంపరాఫర్‌ను ప్రకటించింది. సగం ధరకే మూవీ టికెట్లు ఇస్తామన్నారు. అయితే ఈ ఆఫర్ ఇక్కడ కాదు అమెరికాలో. హనుమాన్ మూవీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు అయిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్మెంట్, నిర్వాణ సినిమాస్ అక్కడి కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో సగం ధరకే టికెట్లు ఇస్తామని వెల్లడించారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం (జనవరి 22) మొత్తం 11 థియేటర్లలో ఈ టికెట్ల తగ్గింపు అందుబాటులో ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. అది కూడా కేవలం కౌంటర్ల దగ్గర నేరుగా టికెట్లు కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఆన్‌లైన్ బుకింగ్‌కు ఇది వర్తించదన్నారు.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆపిల్ సినిమాస్ తోపాటు రెండు చోట్ల సినీలాంజ్, ఒక చోట బీ అండ్ బీ థియేటర్స్ లో ఈ ఆఫర్‌ను ఇస్తోంది హనుమాన్ డిస్ట్రిబ్యూటర్లు. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. హనుమాన్ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. తేజ సజ్జా, అమృతా అయ్యర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. వరలక్ష్మి శరత్ కుమార్ తేజ సజ్జా అక్క పాత్రలో ఆకట్టుకుంది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. గెటప్ శీను, వెన్నెల కిశోర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా తమ మూవీకి వచ్చిన వసూళ్లలో 2.66 కోట్లను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ప్రకటించింది హనుమాన్ చిత్ర బృందం
ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం హనుమాన్. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో మెరిసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డులు కొల్లగొట్టింది. అలాగే హనుమాన్ ప్రతి టికెట్‌పై వచ్చే 5 రూపాలయలను అయోధ్య రామ మందిరానికి విరాళంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం (జనవరి 21) ఏకంగా హనుమాన్ టికెట్లపై వచ్చిన ఆదాయంలో 2.66 కోట్ల రూపాయలను బాలరాముడికి విరాళంగా అందజేసింది.
థియేటర్ల లిస్టు ఇదే..
Celebrating the inauguration of Ayodhya Ram Mandir, few locations in USA are screening #HANUMAN with Half-Priced Tickets 😍
Checkout the list from @AppleCinemas, @CineLoungeusa & @bbtheatres & Enjoy Epic Cinema 🍿
A @PrasanthVarma film 🌟ing @tejasajja123
Overseas Release by… pic.twitter.com/8vROjcAE9o
— Primeshow Entertainment (@Primeshowtweets) January 22, 2024
రూ. 200 కోట్ల క్లబ్ లో హనుమాన్..
जय श्री राम 🙏
With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥
2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥
A @PrasanthVarma film 🌟ing @tejasajja123#HanuManEverywhere@Niran_Reddy… pic.twitter.com/PM4FjDhhJK
— Primeshow Entertainment (@Primeshowtweets) January 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.