Hansika Motwani: బ్రేకప్ స్టోరీ బయట పెట్టిన అందాల హన్సిక.. అది ముగిసిన కథ అంటూ..
తొలి సినిమాతోనే కుర్రక్కారును తన వైపు తిప్పుకుంది ఈ భామ. బబ్లీ లుక్స్ తో కవ్వించింది హన్సిక. దేశముదురు సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది ఈ చిన్నది.
అందాల భామ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హన్సిక. తొలి సినిమాతోనే కుర్రక్కారును తన వైపు తిప్పుకుంది ఈ భామ. బబ్లీ లుక్స్ తో కవ్వించింది హన్సిక. దేశముదురు సినిమా తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ తో దూసుకుపోయింది ఈ చిన్నది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో చేసింది ఈ భామ. ఇదిలా ఉంటే ఇటీవలే హన్సిక పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడి పెళ్లి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
అలాగే తన బ్రేకప్ స్టోరీ కూడా చెప్పుకొచ్చింది హన్సిక. గతంలో హన్సిక తమిళ్ హీరో శింబుతో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అపట్లో ఈ వీరి ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నాకు ఒక లవ్ స్టోరీ ఉంది. కానీ అది ఇప్పుడు ముగిసిపోయిన కథ అని తెలిపింది.
బ్రేకప్ తర్వాత ప్రేమ, పెళ్లి వాటిపై నమ్మకం పోయింది అని తెలిపింది. బ్రేకప్ జరిగిన తర్వాత తిరిగి ప్రేమలో పడటానికి ఎనిమిదేళ్లు పట్టిందని తెలిపింది హన్సిక.. ఇక సోహైల్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేమ పెళ్లి పై నమ్మకం ఏర్పడిందని చెప్పుకొచ్చింది హన్సిక.