Jyothi Rai: మీలాగే మీ మనసూ అందమైనదే.. అక్షయ తృతీయ రోజున మొగిలయ్యకు సాయం చేసిన జగతి మేడమ్.. వీడియో

|

May 10, 2024 | 7:33 PM

తాజాగా ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంది జ్యోతిరాయ్. సాధారణంగా అక్షయ తృతీయ రోజున చాలా మంది బంగారమో, ఇతర ఆభరణాలో కొంటారు. అయితే జ్యోతి రాయ్ మాత్రం ఆ డబ్బుతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సాయం చేసింది.

Jyothi Rai: మీలాగే మీ మనసూ అందమైనదే.. అక్షయ తృతీయ రోజున మొగిలయ్యకు సాయం చేసిన జగతి మేడమ్.. వీడియో
Jyothi Rai, Padma Shri Kinnera Mogilaiah
Follow us on

ప్రముఖ బుల్లితెర నటి జ్యోతిరాయ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ పాత్రతో తెలుగు బుల్లితెర హృదయాల్లో శాశ్వతంగా గూడు కట్టుకుందామె. పేరుకు కన్నడ నటినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందామె. ఇక్కడే కాదు శాండల్ వుడ్ లోనూ జ్యోతి రాయ్ కు ఫుల్ ఫాలోయింగ్, క్రేజ్ ఉంది. అయితే ఇటీవల ఆమె పర్సనల్ వీడియోలు, ఫొటోలు లీక్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిని ధైర్యంగా తిప్పికొట్టిందీ అందాల తార. తాజాగా ఓ మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంది జ్యోతిరాయ్. సాధారణంగా అక్షయ తృతీయ రోజున చాలా మంది బంగారమో, ఇతర ఆభరణాలో కొంటారు. అయితే జ్యోతి రాయ్ మాత్రం ఆ డబ్బుతో పద్మశ్రీ అవార్డు గ్రహీత, 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సాయం చేసింది. తద్వారా తన లాగే తన మనసూ ఎంతో అందమైనదని మరోసారి నిరూపించుకుంది.

పద్మశ్రీ గ్రహీత మొగిలయ్య ఇటీవల హైదరాబాద్ లోని ఓ నిర్మాణ స్థలంలో కూలీ పనులు చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. సాకాత్యూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం వీటికి స్పందించారు. వెంటనే మొగిలయ్యను కలిసి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొగిలయ్య ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకున్న జ్యోతి రాయ్ ఆయనకు తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తన టీమ్ ద్వారా మొగిలయ్యను కలుసుకున్న జగతి మేడమ్ అక్షయ తృతీయ రోజున తన వంతుగా 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుతం తాను కూడా ఇబ్బందుల్లో ఉన్నానని, అయితే తన ఇబ్బందుల కంటే మొగిలయ్య కష్టాలే తనను కలిచివేశాయని జ్యోతి రాయ్ ఆవేదన వ్యక్తం చేసింది. మొగిలయ్య ప్రతిభకు తాను చేస్తున్న డబ్బు సాయం పెద్దది కాదని, ఆయనకు సాయం చేసేందుకు మరికొందరు ముందుకు రావాలని జగతి మేడమ్ కోరింది. ఈ సందర్భంగా మొగిలయ్య పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. జ్యోతి రాయ్ మంచి తనాన్ని మెచ్చుకుంటూ అభిమానులు, నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

వీడియో ఇదిగో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.