AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

టైటిల్ : గుణ 369 జానర్ : యాక్షన్‌ డ్రామా తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్‌, ఆదిత్య, నరేష్‌, హేమ సంగీతం : చైతన్‌ భరద్వాజ నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల దర్శకత్వం : అర్జున్‌ జంద్యాల విడుదల తేదీ : 02-08-2019 ఆరెక్స్ 100 అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించి రెండో ప్రయత్నంలోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఆ తర్వాత చేసిన హిప్పీ […]

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 02, 2019 | 5:40 PM

Share

టైటిల్ : గుణ 369 జానర్ : యాక్షన్‌ డ్రామా తారాగణం : కార్తికేయ, అనఘ, మహేష్‌, ఆదిత్య, నరేష్‌, హేమ సంగీతం : చైతన్‌ భరద్వాజ నిర్మాత : అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాల దర్శకత్వం : అర్జున్‌ జంద్యాల

విడుదల తేదీ : 02-08-2019

ఆరెక్స్ 100 అనే చిన్న సినిమాతో పెద్ద విజయాన్ని సాధించి రెండో ప్రయత్నంలోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఆ తర్వాత చేసిన హిప్పీ మంచి పాఠమే నేర్పింది. ఈ నేపథ్యంలో వస్తున్న గుణ 369 మీద ఇతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. బోయపాటి శీను దగ్గర శిష్యరికం చేసిన అర్జున్ జంధ్యాలను దర్శకుడిగా పరిచయం చేసిన ఈ మూవీ ట్రైలర్ నుంచే ఇదో లవ్ కం మాస్ మూవీ అనే ఇంప్రెషన్ అయితే తెచ్చుకోగలిగింది. మరి ఉన్న ఆ కాసిన్ని అంచనాలు నిలబెట్టుకుని మెప్పించేలా సినిమా ఉందా లేక ఇతనికి మరో ఆప్షన్ కోసం వేచి చూసేలా చేసిందా రివ్యూలో చూద్దాం.

కథ: గుణ (కార్తికేయ) ఎలాగైనా బీటెక్‌ పాసై తన తండ్రి కోరిక తీర్చాలనుకునే సాధారణ కుర్రాడు. కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచి కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. అదే కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) అనే అమ్మాయితో గుణ ప్రేమలో పడతాడు. గుణ మంచితనం గురించి తెలిసి గీత కూడా తనని ఇష్టపడుతుంది. కానీ అదే సమయంలో ఓ స్నేహితుడికి సాయం చేయబోయి గుణ ఇబ్బందుల్లో పడతాడు. గద్ధలగుంట రాధ(ఆదిత్య) అనే రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళతాడు. దీంతో అప్పటి వరకు హ్యాపీగా సాగిపోతున్న గుణ జీవితం చిన్నాభిన్నం అవుతుంది. గుణ కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఈ సమస్యల నుంచి గుణ ఎలా బయటపడ్డాడు.? అసలు రాధను హత్య చేసింది ఎవరు? వాళ్లను గుణ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.

నటీనటులు : యాంగ్రీ యంగ్‌మేన్‌గా కార్తికేయ మరోసారి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌ అంతా లవర్‌ బాయ్‌లుక్‌లో రాముడు మంచి బాలుడులా కనిపించిన కార్తికేయ సెకండ్‌ హాఫ్‌లో మాస్‌ యాక్షన్ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మంచి పరిణతి కనబరిచాడు. తొలి చిత్రమే అయినా అనఘ నటన మెప్పిస్తుంది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది. తండ్రి పాత్రలో నరేష్‌ ఒదిగిపోయాడు. రాధ లుక్‌లో ఆదిత్య సూపర్బ్ అనిపించేలా ఉన్నాడు. మరో కీలక పాత్రలో నటించిన మహేష్‌ రెండు వేరియేషన్స్‌ చాలా బాగా చూపించాడు.

విశ్లేషణ :

చైతన్ భరద్వాజ్‌ సంగీతం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న దర్శకుడు అర్జున్‌ జంద్యాల ఆ కథను మాస్‌ కమర్షియల్ స్టైల్‌లో చెప్పే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాడు. బోయపాటి దగ్గర పనిచేసిన అనుభవంతో మాస్‌, యాక్షన్‌ సీన్స్‌ను చాలా బాగా ప్రజెంట్‌ చేశాడు. ఫస్ట్‌ హాఫ్‌లో వచ్చే లవ్‌ సీన్స్‌లో మాత్రం కాస్త తడబాటు కనిపించింది. సెకండ్‌ హాఫ్‌ను ఎమోషనల్‌, యాక్షన్‌, సెంటిమెంట్ సీన్స్‌తో ఆసక్తికరంగా మలిచాడు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలకు ఎదురవుతున్న ఇబ్బందులను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు మాస్‌ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేయటంలోనూ మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ హైలెట్‌గా నిలుస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌ : కథ క్లైమాక్స్‌

మైనస్‌ పాయింట్స్‌ : లవ్‌ సీన్స్‌

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే