AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?

తెల్లటి గుబురు గడ్డం, మీసాలు.. భుజంపై బాణాలు.. ఇలా సరికొత్తగా కనిపిస్తోన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా? సినిమా, సినిమాకు వైవిధ్యం ప్రదర్శించే అతను ఇప్పుడు తన కొత్త మూవీ కోసం ఇలా మారిపోయాడు. ఈ ఫొటోను చూసి అతని అభిమానులు షాక్ అవుతున్నారు. అంతకన్నా ముందు చాలామంది ఇతనెవరో గుర్తు పట్టలేకపోయారు.

Tollywood: గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయిన స్టార్‌ హీరో.. షాకవుతోన్న ఫ్యాన్స్.. ఎవరో తెలుసా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Jul 09, 2024 | 8:58 AM

Share

తెల్లటి గుబురు గడ్డం, మీసాలు.. భుజంపై బాణాలు.. ఇలా సరికొత్తగా కనిపిస్తోన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా? సినిమా, సినిమాకు వైవిధ్యం ప్రదర్శించే అతను ఇప్పుడు తన కొత్త మూవీ కోసం ఇలా మారిపోయాడు. ఈ ఫొటోను చూసి అతని అభిమానులు షాక్ అవుతున్నారు. అంతకన్నా ముందు చాలామంది ఇతనెవరో గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత తమ అభిమాన హీరోనే అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా? ఇతను మరెవరో కాదు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. రజనీకాంత్ జైలర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైన శివన్న ఇప్పుడు మరో సరికొత్త పాత్రతో మన ముందుకు వస్తున్నాడు. అతను నటిస్తోన్న తాజా చిత్రం భైరవనకొనే పాటా. రీసెంట్ గా ఈ సినిమా టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు విడుదలైన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. ఇందులో తెల్లటి గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్ లో కనిపించాడు శివన్న. భుజంపై బాణాలు, అలాగే అతని వైపు దూసుకొస్తున్న బాణాలు, గుర్రం తదితర వాటిని చూస్తుంటే ఇదేదో పీరియాడికల్ సినిమాలా అనిపిస్తోంది. దీనికి ‘లెసన్స్ ఫర్ ది కింగ్’ అని ఇంగ్లీషులో క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హేమంత్ రావు గతంలో ‘గోది బల్ల సదర్ మైకట్టు’, ‘కావలుదారి’, ‘సప్త సాగరదాచే ఏలో’ సైడ్ ఎ, సైడ్ బి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు శివరాజ్‌కుమార్‌తో చేతులు కలపడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. ‘వైశాఖ్‌ జె ఫిలిమ్స్‌’ బ్యానర్‌పై వైశాఖ్ జె గౌడ భైరవ కోన పాటా సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. కాబట్టి ఇప్పట్లో రిలీజయ్యే అవకాశాలు లేవు. మరోవైపు శివరాజ్‌కుమార్ ‘భైరతి రంగల్’, ‘ఉత్తరకాండ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల విడుదల తర్వాత ‘భైరవన్ కోనా పాటా’ రిలీజయ్యే అవకాశముంది. కన్నడతో పాటు తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

భైరవకోన పాటా సినిమలో శివరాజ్ కుమార్ న్యూ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.